కాకతీయ కాలనీలో కన్నుల పండుగగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలు

 కాకతీయ కాలనీలో కన్నుల పండుగగా శ్రీ సీతారాముల  కళ్యాణ మహోత్సవ వేడుకలు




వరంగల్ : సీతారాముల కల్యాణ మహోత్సవ వేడుకలను బుధవారం కాకతీయ కాలనీ ఫేస్ టూ లో  కన్నుల పండుగగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం  తిలకించి ఆశీర్వచనం పొందారు. సుమారు మూడు గంటల పాటు సాగిన ఈ కల్యాణోత్సవంలో కాలనీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.  వివాహమహోత్సవం అనంతరం భక్తులకు ఆశీర్వచనం నిర్వహించి ప్రసాద వితరణ గావించారు. భక్తులకు బెల్లం పానకం అందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 


వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సతీసమేతంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి హాజరై పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి దంపతులను కాలని ప్రతినిధులు శాలువాతో సత్కరించారు.


 తొమ్మిదవ డివిజన్ కార్పోరేటర్ చీకటి శారద ఆనంద్ కాళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. వారిని కాలనీవాసులు శాలువాతో సత్కరించారు. కాకతీయ కాలని అభివృద్ది కమిటి అద్యక్షులు ఉదయ రాజు రంగారావు, కార్యదర్శి బ్రహ్మ దేవరపు  హరికృష్ణ, ఉపాధ్యక్షులు  ఆదిరాజు నర్సింహారావు, కూన మహేందర్,  రావిశెట్టి రవికుమార్, కాలని అభివృద్ది కమిటి కోశాధి కారి కేస వీరేశం, మంగళం పల్లి శ్యాంసుందర్,గూడూరు రాజు, ముక్కా సురేష్, అమరేందర్ రెడ్డి, వరమల్ల రోహిత్, గందె క్రాంతి కుమార్, బ్రహ్మదేవరపు శ్రీదేవి,  ఆదిరాజు శైలజ, కేస అనురాధ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు