బిజెపి ఫాసిస్టు విధానాలను వ్యతిరేకించండి
కవులు, సాహిత్యకారుల మీద దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి
నిరసన ధర్నాలో వివిధ సంఘాల నాయకుల పిలుపు
ప్రజాస్వామ్య భారతదేశంలో బావ ప్రకటన స్వేచ్ఛను హరించి వేస్తూ పాలన కొనసాగిస్తున్న బిజెపి దాని అనుబంధ సంస్థల ఫాసిస్టు విధానాలను దేశంలోని ప్రతి ఒక్కరూ ఖండించాలని, ఆదివారం కాకతీయ విశ్వవిద్యాలయంలో సాహిత్యకారులు, కవులపై దాడి చేసిన మతోన్మాదులను వెంటనే అరెస్టు చేయాలని వివిధ ప్రజా సంఘాల నాయకులు, కవులు, సాహిత్యకారులు డిమాండ్ చేశారు. ఆదివారం వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీలో లౌకిక విలవలు - సాహిత్యం అనే అంశంపై జరిగిన సదస్సులో పాల్గొన్న సాహిత్యకారులు, కవులు, ప్రొఫెసర్లు, కేంద్ర సాహిత్య పురస్కార గ్రహీతలైన కాత్యాయని విద్మహే, పసునూరి రవీందర్, అంపశయ్య నవీన్, మెర్సీ మార్గరెట్, నందిని సిద్ధారెడ్డి, ఖాదర్ మోయినోద్దీన్, లక్ష్మినర్సయ్య, యాకూబ్, అన్వర్, నాళేశ్వరం శంకరం, రూపారుక్మిణి, అనిశెట్టి రజిత, బన్నా ఐలయ్య, స్కైబాబా, కె ఆనందాచారి, సౌధా అరుణ, బమ్మిడి, భూపతి వెంకటేశ్వర్లు, డాక్టర్ జిలుకర శ్రీనివాస్, మచ్చ దేవేందర్, తైదల అంజయ్య, పొన్నాల బాలయ్య తదితర ప్రముఖులపై హిందూ మతోన్మాద మూకలు విచక్షణారహితంగా తిట్టి, భౌతికంగా దాడులు చేయడంపై హన్మకొండ జిల్లా కేంద్రం అంబేద్కర్ సెంటర్ వద్ద సోమవారం జరిగిన నిరసన ధర్నాలో వివిధ సంఘాల నాయకులు పాల్గొని మాట్లాడారు.
ప్రొఫెసర్ కాత్యాయని విద్మహే, విముక్త చిరుతల కక్షి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జిలకర శ్రీనివాస్, ఆల్ ఇండియా ఒబిసి జాక చైర్మన్ సాయిని నరేందర్, ప్రొఫెసర్ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, న్యూ డెమోక్రసీ నాయకులు నున్న అప్పారావు, ప్రజాస్వామ్య రచయితల వేదిక నాయకురాలు అనిశెట్టి రజిత, జైసింగ్ రాథోడ్, మార్క శంకర్ నారాయణ, సోమ రామమూర్తి, సిపిఎం జిల్లా అధ్యక్షులు బొట్ల చక్రపాణి, కొండ్ర నర్సింగరావు లు మాట్లాడుతూ బావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా చేస్తున్న మతోన్మాద బిజెపినీ దాని అనుబంధ సంఘాలులను వ్యతిరేకించాలని వివిధ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు.
మతోన్మాదులు, అల్లరి మూకలు, బిజెపి అనుబంధ నాయకులు సాహిత్యకారులు, కవుల మీద దాడి చేయడం హేయమైన చర్య అని, దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. పోరు గడ్డ తెలంగాణలో ఇలాంటి మతోన్మాద దాడులకు తావు లేదని, మతోన్మాద బీజేపీకి ఓటుతో బుద్ధి చెప్పాలని రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బిజెపిని చిత్తుగా ఓడించాలని అందుకోసం తెలంగాణలోని ప్రగతిశీలవాదులు, ప్రజాస్వామ్య శక్తులు గ్రామ గ్రామాన ప్రచారం చేయాలని విజ్ఞప్తి చేశారు. దాడి వెనుక స్వభావాన్ని ప్రగతిశీలవాదులు అర్థం చేసుకోవాలని, బిజెపి, సంఘ్ పరివార్ శక్తులు వారు అనుకున్న సామాజిక నిర్మాణంలో బాగంగా ఇలాంటి దాడులు జరుగుతున్నాయని, సమైఖ్యంగా ఉన్న ప్రజలను విచ్ఛిన్నం చేయడం కోసమే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. ప్రజల నిజమైన సమస్యలను, ఆర్థిక అసమానతలను రూపుమాపి ప్రజల సర్వతోముఖాబివృద్ధికి కృషి చేయాల్సిన బిజెపి ప్రభుత్వం మతం పేరుతో ప్రజల మధ్య చీలికలు తీసుకొచ్చి పబ్బం గడుపుతుందని, ఉద్దేశ్యపూర్వకంగానే దేశంలో ప్రగతిశీలవాదులు, ప్రజాస్వామికవాదులు, దళితులు, ఆదివాసులపై దాడులు చేస్తూ, బహిరంగంగా అత్యాచారాలు చేస్తూ హత్యలు చేస్తున్నారని అన్నారు. మాదిగలను మతోన్మాద పార్టీ అయిన బిజెపికి తాకట్టు పెట్టిన మంద కృష్ణ మాదిగ మాదిగలపైనే ఇలాంటి దాడులు జరుగుతుంటే సమాధానం చెప్పాలని, మంద కృష్ణతో పాటు వరంగల్ పార్లమెంటు నుండి పోటీ చేస్తున్న ఆరూరి రమేష్ లు ఈ దాడులకు బాధ్యత వహించాలని అన్నారు.
ఈ నిరసన ధర్నాలో ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్, సమూహ కన్వీనర్ ప్రోఫెసర్ కాత్యాయని విద్మహే, కవి, విమర్శకులు, చరిత్రకారులు ప్రోఫెసర్ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు నున్న అప్పారావు, విముక్త చిరుతల కక్షి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జిలుకర శ్రీనివాస్, కార్యనిర్వహక అధ్యక్షులు మచ్చ దేవేందర్, అభ్యుదయ రచయితల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మార్క శంకర్ నారాయణ, తెలంగాణ ఉద్యమకారుల వేదిక కన్వీనర్ సోమ రామమూర్తి, భారత్ బచావో నాయకులు జైసింగ్ రాథోడ్, జి. సోమయ్య, రాజ్ మహ్మద్, మాధార్ సాహెబ్, డోరి రాజయ్య, దళిత బహుజన బహుజన ఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శి చుంచు రాజేందర్, ప్రజా ఫ్రంట్ నాయకురాలు రమాదేవి, ప్రజాస్వామ్య రచయితల వేదిక నాయకురాలు అనిశెట్టి రజిత, రజక రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు చాపర్తి కుమార్ గాడ్గే, చైతన్య మహిళా సంఘం జె. కళ, అనిత, సిపిఎం హన్మకొండ జిల్లా అధ్యక్షులు బొట్ల చక్రపాణి, పౌర హక్కుల సంఘం జిల్లా కార్యదర్శి సారంగపాణి, జయంత్, ప్రవీణ్, రైల్వే జాక్ నాయకులు కొండ్ర నరసింగరావు, నాగపురి రాజయ్య, బి.సి కులాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు సోమిడి అంజన్ రావు, బి.ఎస్.పి నాయకులు కన్నం సునీల్, న్యాయవాదులు జె జె స్వామి, ఎగ్గడి సుందర్ రామ్, కూనూరు రంజిత్ గౌడ్, సారంగపాణి, తెలంగాణ ప్రజా ఫ్రంట్ నాయకులు సదానందం, ప్రజా కవి యోచన, తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు నన్నెబోయిన తిరుపతి యాదవ్, జగపతిరావు, బిళ్ళ సుబ్బారావు, వివిధ సంఘాల నాయకులు ఐతం నగేష్, కన్నాల రవి, ఉప్పలయ్య, కుమారస్వామి, అర్జున్, తెలంగాణ కొమరయ్య, కేడల ప్రసాద్, భాసిత్, వద్దెబోయిన శ్రీనివాస్, కొమ్ముల కరుణాకర్, మాధాసి సురేష్, భద్రయ్య, మోరే ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box