లంచం తీసుకుంటూ ఏసీబీ కి దొరికిన ఎస్ ఐ ఓ పత్రికా విలేకరి

 


మెదక్ జిల్లా హవేలి ఘనపూర్ ఎస్ ఐ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు 

ఓ వ్యక్తి నుండి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఎస్సైని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. లంచం వ్యవహారం లో మధ్యవర్తిగా వ్యవహరించిన ఓ పత్రికా విలేకరిని కూడా ఏసీబీ అధికారులు అరెస్టు చేసారు.

మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ స్టేషన్ ఎస్పై ఆనంద్ గౌడ్ ఇసుక తరలిస్తున్న ఓ టిప్పర్ ను అక్రమరవాణ కింద పట్టుకున్నాడు.

స్వాధీనంలో ఉన్న టిప్పర్ ను ఇవ్వడానికి 20 వేల రూపాయలు డిమాండ్ చేసాడు. లేదంటే కేసు పెడతా నంటూ బెదిరించాడు. ఈ వ్యవహారంలో బిక్కనూర్ కు చెందిన ఓ పత్రికలో పనిచేసే విలేకరి మస్తాన్ మధ్యవర్తిగా  రంగంలోకి వచ్చాడు. భాదితుడు ఏసీబీ అధికారులను అశ్రాయించాడు. దాంతో  ఏ.సీ.బీ అధికారులు వలపన్ని "లంచం" తీసుకుంటుండగా ఎస్ ఐ ని సోమవారం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు