*దుర్గాబాయి దేశ్‌ముఖ్ రెనోవా క్యాన్సర్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్పీచ్ *
పేదలకు వైద్యం అందించడంలో దుర్గాబాయి దేశ్ ముఖ్ హాస్పిటల్ మరొక అడుగు ముందుకు వేయడం అభినందనీయం.
క్యాన్సర్ మహమ్మారితో చాలా మంది అనేక ఇబ్బందులు పడుతున్నారు..
క్యాన్సర్ చికిత్స పేదలకు భారామవుతున్న పరిస్థితి..
రాష్ట్రంలో క్యాన్సర్ వైద్య సేవలు అందరికీ అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది..
ఎవరైనా ఆసుపత్రికి వెళితే తరచూ ప్రాథమిక పరీక్షలు చేయాల్సిన పరిస్థితి.
హెల్త్ రికార్డ్స్ లేకపోవడం వల్లే తరచూ ప్రాథమిక పరీక్షలు చేయాల్సిన పరిస్థితి..
అందుకే రాష్ట్రంలో ప్రతీ ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ ను డిజిటలైజ్ చేసేందుకు చర్యలు చేపడుతున్నాం.
సమర్థుడైన వ్యక్తి ఆరోగ్య శాఖకు మంత్రిగా ఉన్నారు..
విద్య, వైద్యం మా ప్రభుత్వ ప్రాధాన్యతలు.
హాస్పిటల్ యాజమాన్యం మా దృష్టికి తీసుకొచ్చిన ప్రతిపాదనలను అమలు చేసేందుకు ప్రయత్నిస్తాం.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box