పట్టభద్రులు ఓటు హక్కు విధిగా వినియోగించుకోవాలి -ఎలక్షన్ వాచ్ కమిటి నేషనల్ చైర్మన్ డాక్టర్ బొమ్మర బోయిన కేశవులు


సోమవారం(27 న) జరగనున్న వరంగల్ - ఖమ్మం- నల్గొండ శాసన మండలి ఎన్నికలలో ఓటు హక్కు ఉన్న ప్రతి  ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ ఛైర్మెన్ డా. బొమ్మర బోయిన కేశవులు తెలిపారు. ఆదివారం వరంగల్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో సమాచార హక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

 మొన్నటి వరకు అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు జరిగాయని  ప్రస్తుతం ఉమ్మడి నల్గొండ - వరంగల్- ఖమ్మం శాసన మండలి పట్టభద్రుల ఎన్నికలు సోమవారం జరుగుతున్నందున ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునీ  వంద శాతం  ఓటింగ్ నమోదు చేయాలన్నారు.

వివిధ వర్గాలు ప్రభుత్వం  తమ  అభివృద్ధి కి తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటుంటారు. రైతులు గిట్టుబాటు ధర కావాలని, నిరుద్యోగులు ఉద్యోగాలు రావాలని, యువత ఉపాధి అవకాశాలు కల్పించాలని ఇలా ఎవరికి వారు ఎన్నో కలలు కంటుంటారు. వారి కలలు సాకారం కావాలంటే మంచి నాయకులు  కావాలి.  మంచి నాయకులు కావాలంటే ఓటర్లు తప్పనిసరిగా వంద శాతం ఓటు హక్కు వినియోగించుకుని మంచి నాయకులను ఎన్నుకోవాలనీ తెలిపారు. ఈ ఎన్నికలలో

ప్రజాస్వామ్య పరిరక్షణకు యువత, చదువుకున్నవారు నడుం బిగించి ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలన్నారు. పట్టణ ప్రాంతాలలో కొంత మంది చదువుకున్నవారు ఉద్యోగులు ఓటింగ్ కు దూరంగా  ఉంటున్నారు. ఫలితంగా ఓటింగ్ శాతం తగ్గుతున్నది. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైనది. ఎన్నికలలో మంచి అభ్యర్థులను ఎన్నుకోవాలి. ఒక వేళ అభ్యర్థులు ఎవరూ నచ్చని పక్షంలో నోటాకు ఓటు వేయాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఓటు హక్కు ను వేయకుండా వృధా చేయవద్దు.  ఎన్నికల సంఘం పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఓటర్లుగా మనం భాద్యతగా ఓటు వేసి మన కర్తవ్యాన్ని నిర్వహించాలి.

  ఓటు హక్కు పొందడం ఎంత ముఖ్యమో ఓటు వేయడం అంతే ముఖ్యం.   పోటీ చేసే అభ్యర్థుల ఎవరూ నచ్చని పక్షంలో నోటా కు ఓటు వేయాలి తప్ప ఓటును విస్మరించవద్దు అని సూచించారు.   

ఈ నెల 27న ఎన్నికలు ఉండటంతో ఇంట్లో ఉండకుండా తప్పనిసరిగా పోలింగ్ స్టేషనుకు వెల్లి బ్యాలెట్ పేపర్లో ఓటు వేయాలి. అతిథిగా విచ్చేసిన  కన్నెబోయినా ఉషా రాణి మాట్లాడుతూ  శాసన మండలి ఎన్నికలలో ఓటు హక్కు ఉన్న ప్రతి మహిళా తప్పనిసరిగా తమ ఓటు ను వినియోగించుకుని ఓటింగ్ శాతం పెంచాలన్నారు. ఎన్నికలలో ప్రతి ఒక్కరూ తప్పని సరిగా ఓటు హక్కు ను వినియోగించుకుని మంచి నాయకులను చట్ట సభలకు పంపాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సమాచార హక్కు పరిరక్షణ సమితి జాతీయ ఛైర్మెన్ డా.బొమ్మర బోయిన కేశవులు, రాష్ట్ర కన్వీనర్ కన్నెబోయిన ఉషారాణి లను ఘనంగా సత్కరించారు.

ఉమ్మడి వరంగల్ జిల్లా సమాచార హక్కు పరిరక్షణ సమితి కో ఆర్డినేటర్ గాడిపల్లి మధు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో దూడల సాంబయ్య,

జయసింగ్ రాథోడ్, సోమ రాంమూర్తి, సాయిని నరేందర్, చాపర్తి కుమర్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు