ములుగు ప్రభుత్వ వైద్య కళాశాల లో ఉద్యోగ నియామకాలు



 




 ములుగు ప్రభుత్వ వైద్య కళాశాల లో ఉద్యోగ నియామకాలు - ములుగు జిల్లా

ములుగు ప్రభుత్వ వైద్య కళాశాలలో వివిద విభాగములలో గల స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులను భర్తీ చేసేందుకు డైరక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగినది. దానికి అనుగుణంగా జిల్లా కలెక్టర్, ములుగు  అనుమతితో ములుగు ప్రభుత్వ వైద్య కళాశాలలో వివిద విభాగములలో గల స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులను గౌరవ వేతనంతో కూడిన కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయుటకు అర్హులైన వైద్యుల నుండి ప్రొఫెసర్లు 15, అసోసియేట్ ప్రొఫెసర్లు 9, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 55 మరియు సీనియర్ రెసిడెంట్లు 19 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించడమైనది.


పైన తెలిపిన పోస్టులకు వయస్సు, విద్యా అర్హతలు (MBBS/MD/MS/DMB) ఇతర పూర్తి వివరాలు ఈ వెబ్ సైట్ https://mulugu.telangana.gov.in/ లో పొందుపరచబడి

ఉన్నవి. కావున అర్హులైన డాక్టర్ అభ్యర్థులు 26.07.2024 రోజు ఉదయం 10:30 నుండి 01.08.2024 రోజు సాయంత్రం 05:00 వరకు ప్రిన్సిపల్, ప్రభుత్వ వైద్య కళాశాల-ములుగు గారి కార్యాలయం రూమ్ నెంబర్ 48, 1" ఫ్లోర్, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్- ములుగు నందు దరఖాస్తు చేసుకోగలరని డా. బి. మోహన్ లాల్ ప్రిన్సిపల్, ప్రభుత్వ వైద్య కళాశాల-ములుగు గారు తెలియచేశారు.


---ends

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు