కాశీ..వారణాశి..మిస్సయిన వాసి..!


 కాశీ..వారణాశి..

మిస్సయిన వాసి..!


(_సురేష్..9948546286_)


(kalki..may be visual 

Wonder..

But as usual.. confusion)


చూస్తున్నది తెలుగు సినిమానే..

దానికి టెక్నాలజీ 

హంగులు కూర్చి..

పురాణ పాత్రలను పేర్చి..

భారీ తారాగణాన్ని సమకూర్చి..

మూడొందలు పెట్టి 

ధియేటర్ కు వచ్చి కూర్చున్న

ప్రేక్షకున్ని కట్టిపడేసి..

మొత్తంగా బాక్సాఫీసును

ఉల్కిపడేలా చేసిన

సోషియో..ఫాంటసీ..

మైధిలాజికల్ మూవీ

*_కల్కి 2898 ఎడి..!_*


సినిమాలో వినిపించేవి

పురాణ పాత్రల పేర్లే...

కనిపించేవి మాత్రం

ఆ పాత్రలు కావు..

ఆ గెటప్పులు..ఆ సెటప్పులు..

ఆ మేకప్పులు..ఆ పికప్పులు..

పైకప్పులు ఎగిరిపోయేలా

ఆ సౌండ్సు..

అన్నీ కలగలిపిన

టాలీవుడ్..కోలీవుడ్..

హాలీవుడ్ సినిమా

*_కల్కి 2898 ఎడి..!_*


మన పురాణ కథకు

ఇంగ్లీష్ ముసుగు తొడిగి..

హాలీవుడ్ సాంకేతికత

జోడించి..

పాత్రల ఆహార్యం కూడా

ఆంగ్ల సినిమాల మాదిరి

సెట్ చేసి...

ఏం చెప్పాలని అనుకున్నాడో..

ఏం చెప్పాడో..

దర్శకుడు తనకు తెలుసని

అనుకున్నా..

జనానికి అర్థమయ్యే రీతిలో

చెప్పలేకపోయిన 

సినిమా..

*_కల్కి 2898 ఎడి..!_*


దీనికి మళ్ళీ అయిదేళ్ల పరిశోధన.. కథ ఓకే..

దానిలో ఆ పరిశోధన లోతు కనిపించింది..కానీ చెప్పిన తీరు

క్లియర్ గా..క్లారిటీతో లేదు..!


స్థూలంగా మహావిష్ణువు

పదో అవతారం కల్కి

జననం ప్రధాన ఇతివృత్తం.

దుర్మార్గులు చేసిన ప్రయోగంలోనే కల్కి 

ఓ మాతృగర్భంలో పిండంగా

రూపుదిద్దుకోవడం..

ఆ తల్లి తప్పించుకుంటే

తిరిగి తమ బందీగా

చేసుకోడానికి ఒక బృందం..

కాపాడుకోడానికి ఒక గణం..

వారికి ఒక లోకం..

వీరికి ఒక లోకం...

ఆ తల్లి శోకం..

మొత్తంగా కథ అర్థంకాని

ప్రేక్షకుడు ఓ మాలోకం..

పోయింది మూడొందల పైకం..!


అర్జనుడు...

అశ్వద్ధామ....

ద్రోణాచార్యుడు..

ఉత్తర..

ఆపై కృష్ణుడు..

సడెన్ గా కర్ణుడు..

చివరి వరకు కనిపించని

కల్కి..అంటే హీరో పాత్ర

వచ్చేది ..

*_కల్కి continues.._*

సినిమాలోనే..

కల్కి వస్తాడు..

కల్కి వస్తాడు 

అని పల్కి పల్కీ 

పాత్రలు అలసిపోయాయి..

కల్కి మాత్రం జనం కుర్చీలోంచి

లేచేపోయే వరకు 

కూడా రాలేదు..!


దానాదీనా చెప్పొచ్చేదేంటంటే..

మన కథే.. మన పాత్రలే...

ప్రాంతాలు మాత్రం కాశీ

మినహా సగటు ప్రేక్షకుడికి

తెలియనివే..

పాత్రలు..ఆహార్యాలు.. మాట్లాడింది తెలుగైనా

పలికిన తీరు...

ఆంగ్ల సినిమా చూస్తున్నట్టు..

వస్తున్నది కల్కి కాదు..

ఏసుక్రీస్తు అన్నట్టు..

ఒక్క మాటలో చెప్పాలంటే

కల్కి *_పునరాగమనం_* కాదు..

ఏసు *_పునరుత్థానం_* అన్నట్టు సాగింది 

*_సినీమా..య..!_*


ఇంగ్లండ్ తో సెమీఫైనల్ మ్యాచ్ చూడకుండా ఐనాక్స్ కి

వచ్చి ఇంగ్లీష్ సినిమా చూసినట్టు.. ఓరి మ్యాచ్ మానేసి అనవసరంగా..

ఈ సినిమాకి వచ్చేసాం..

అక్కడ మ్యాచ్ లో

రోహిత్ సేన హల్చల్..

ఇక్కడ సినిమా గోల్ మాల్..!


ఇంతకీ ప్రభాస్ వరకు

ఈ సినిమాకి హీరో ఆయన కాదు..ఈ బాహుబలి

ఒకరకంగా కామెడీ విలన్. 

అంత పొడుగు మనిషీ

అమితాబ్ ముందు

ఆహార్యంలో..అభినయంలో

పొట్టివాడుగా మారిపోయి

తన్నులు తిన్నాడు.


సినిమా మొత్తం అమితాబ్

వన్ మ్యాన్ షో..

ఆ వయసులో కూడా పెద్దాయన అదరగొట్టేశాడు.

రాజేంద్రప్రసాద్..

మృణాల్ ఠాకూర్..

శోభన..

ఆపై కొత్త కమెడియన్లు

*_రాజమౌళి..ఆర్జీవి.._*

ఎందుకు ఉన్నాడో

తెలియని బ్రహ్మానందం..!..

కమల్ అభినయానికి పెద్దగా ఆస్కారం లేకపోయినా..

ఎప్పుడో దశావతారం ఎత్తేసిన 

అతగాడికి ఇది మరో 

తెలియని అవతారం..!


అయినా..ప్రభాస్ ను మామూలు కుర్ర హీరోగా

మిర్చి..మిస్టర్ పర్ఫెక్ట్..

గెటప్పుల్లో చూడాలి అనుకుంటే

ఆ కోరిక తీరడం లేదు.

ఎంతసేపూ..

బాహుబలి..

ఒకటి రెండు..

అదో ట్రెండు...


సలార్ వన్ టూ...

హిట్టు వన్ బై టూ..


ఇప్పుడు కల్కి..

మళ్ళీ కల్కి..

కష్టంగా ఉంది.!


డూడ్..డార్లింగ్...

రజనీకాంత్...

బుజ్జిగాడు..


*_మిస్ యూ ప్రభాస్..!_*

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు