సినిమా రాముడు అడవి రాముడు

 


*_సినిమా రాముడయ్యాడు_*

*_అడవిరాముడు!_*

______________________


*_ఆరేసుకోబోయి పారేసుకున్నాను_* 

*_హరి..హరి.._*

ఒక్క పాట..

అందులో ఎన్టీవోడి ఆట..

జయప్రద గోల..

ఎంత సంచలనం..

ఆ పాటతోనే 

ఆ సినిమా హిట్టు

నందమూరి అయ్యాడు  తెలుగు సినిమా 

పరిశ్రమలో మరోసారి 

*_తిరుగులేని సామ్రాట్టు..!_*


ఎన్టీఆర్ రాముడు 

సినిమాల పరంపరలో 

అతి పెద్ద సక్సెస్

బద్దలైపోయింది బాక్సాఫీస్ 

అప్పటికి కొన్ని వైఫల్యాలతో

ఇబ్బంది పడుతున్న 

తారకరాముడు..

ఇక ఎన్టీఆర్ 

పనైపోయిందేమోనన్న

విమర్శలను పటాపంచలు చేస్తూ *_అడవిరాముడు_* సూపర్

ఆపై వెనుదిరిగి చూడని 

రామారావు 

హిట్టు మీద హిట్టుతో 

*_అందుకున్నాడు పవర్!!_*


ఔట్ డోర్ 

షూటింగులకు 

దూరంగా ఉండే ఎన్టీఆర్ అడవుల్లో తిరిగి

నిజంగా అయ్యాడు 

_*అడవిరాముడు..*_

జలపాతాల్లో గెంతి..

ఏనుగులెక్కి..

రాళ్ళగుట్టలపై దూకి

అరవైలో ఇరవై అయ్యాడు

సినిమాని పరుగులు తీయించాడు..

*_అమ్మతోడు అబ్బతోడు_* అంటూ 

ఇద్దరు నాయికలతో నృత్యాలు..

*_కోకిలమ్మ పెళ్లికి_* అంటూ 

*_కోనంతా_* చేసిన *_సందడి.._*

*_కృషి ఉంటే మనుషులు_*

*_రుషులవుతారు.._*

ఈ పాటలో ధరించిన 

బహురూపాలు...

నందమూరిని 

జనం ఎలా ఎన్ని రకాలుగా 

చూడాలని కోరుకుంటారో

అన్ని గెటప్పులను సెటప్పు

చేసిన దర్శకరుషి 

అభిమానుల్ని చేశాడు 

భలే ఖుషి..

ఈ బొమ్మే చేసింది జయప్రద

అనే అందమైన బొమ్మని

తెలుగు సినిమా పట్టమహిషి..!


వేటూరి పాటలు..

జంధ్యాల మాటలు..

మామ సంగీతం..

జగ్గయ్య గంభీరమైన గొంతు

*_పులి ఉప్మా తిందేమిటి చెప్మా_*

రాజబాబు తంతు..

_చరిత్ర అడక్కు చెప్పింది విను_

నాగభూషణం పాలిష్డ్ విలనిజం..

సత్యనారాయణ మేనరిజం..

వెరసి అడవిరాముడు 

నందమూరి తారక రామారావు 

కమర్షియల్ సినిమాల్లో 

అతి పెద్ద హిట్టన్నది 

తిరుగులేని నిజం!!

***********************      

సత్యచిత్ర వారి 

*అడవిరాముడు*

బ్లాక్ బస్టర్ మూవీ 

విడుదలై నేటికి

47 సంవత్సరాలు

(28.04.77)

పూర్తయిన సందర్భంగా..

     *ఎలిశెట్టి సురేష్ కుమార్*

          9948546286

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు