*_VOTE..NOT FOR SALE..!_*


*_(సురేష్..9948546286)_*


చేతిలో చెయ్యేసి 

చెబితే ఒట్టు..

నీతిగా పెట్టెలో వేసేది ఓటు..!


కరెన్సీ నోటుపై రిజర్వ్ బ్యాంక్ 

గవర్నర్ సంతకం..

ఓటుపై నీ నిజాయితీ సంతకం..!


ఓటును అమ్మేసావా..

ఒక్కసారి నువ్వు తింటున్న

అన్నం చూడు..

రక్తంతో తడిసి ఎర్రగా..!


ఓటును అమ్మడమంటే ప్రశ్నించే హక్కును

కోల్పోయినట్టే..!


ఓటు విషయంలో దేహి అన్నావంటే ద్రోహిగా మిగిలిపోతావు జాగ్రత్త..!


అదిగో..పోలింగ్ కేంద్రం

నుంచి బోర విరుచుకుని వస్తున్న అన్నని చూడు..

నిజాయితీగా ఓటేసిన 

గర్వం అది..!


*_ఓటును అమ్మేసావు కదా చులాగ్గా.._*

*_లోనకెళ్ళి చూసుకో_*

*_నీకు నువ్వే అ(క)నిపిస్తావు చులకనగా..!_*


🗳️🗳️🗳️🗳️🗳️🗳️🗳️

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు