అబద్దాల బిజెపిని ఓడించండి

 


అబద్దాల బిజెపిని ఓడించండి 


ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్ 


రాజ్యాంగాన్ని రక్షించే ఉద్యమంలో న్యాయవాదులు కీలకం


వరంగల్ కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థి కడియం కావ్య


    అవినీతిని అంతమొందించి, స్వదేశీ ఉత్పత్తులు పెంచి నిరుద్యోగ నిర్మూలన ద్వారా దేశంలోని ప్రజల మధ్యనున్న ఆర్థిక అసమానతలను రూపుమాపుతమని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన బిజెపి అందుకు భిన్నంగా ప్రజలను మతం వైపు తిప్పి, ప్రజలను మత బానిసలను చేసి, మెజార్టీ ప్రజలైన హిందువులను భయంలోకి నెట్టి తిరిగి అధికారంలోకి రావాలనే కుట్రలు చేస్తున్న అబద్దాల బిజెపిని చిత్తుగా ఓడించి ఇండియా కూటమిని గెలిపించాలని ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్, న్యాయవాద నాయకుడు సాయిని నరేందర్ అన్నారు. హన్మకొండ జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో శుక్రవారం వరంగల్ లీగల్ సెల్ నాయకుడు న్యాయవాది జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన వరంగల్ పార్లమెంటు స్థాయి న్యాయవాదుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పచ్చి అబద్ధాలతో 10 ఏండ్ల పాలన చేసిన బిజెపి ప్రజల అభివృద్ధి గురుంచి మాట్లాడకుండా ప్రజలను చీల్చే మతాల గొడవలను, రిజర్వేషన్ల అంశాలను ముందుకు తీసుకొచ్చి మాట్లాడుతున్న బిజెపి కుటిల మాటలను సమాజంలోని న్యాయవాదుల లాంటి విజ్ఞులు తిప్పికొట్టాలని అన్నారు. భారతదేశంలో 60 శాతం పైగా నున్న బి.సి ల కుల జనగణన చేయకుండా సకల సామాజిక రంగాల్లో వారి వాటా వారికి ఇవ్వకుండా బి.సి లను హిందూ మతం చుట్టూ తిప్పుతూ మాట్లాడుతున్న మోడీ మాటలను బి.సి నమ్మి మోసపోకూడదని అన్నారు. కుల జనగణన చేసి జనాభా దామాషా ప్రకారం సకల సామాజిక రంగాల్లో ఎవరు ఎంతమందో వారికి అంత వాటా కల్పిస్తామని మ్యానిఫెస్టోలో పెట్టిన ఇండియా కూటమిని గెలిపించుకుంటేనే దేశ ప్రజల అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ప్రజల అభివృద్ధి కోసం విలువైన చట్టాలు రూపొందించి, వాటిని అమలు పరిచే చట్టసభల్లో డాక్టర్ కడియం కావ్య లాంటి విద్యావంతులు ప్రవేశించాల్సిన అవసరముందని అందుకోసం వరంగల్ పార్లమెంటు పరిధిలోని న్యాయవాదులు, విద్యావంతులు, మేధావులు, విద్యార్థులు, మహిళలు, కవులు కర్షకులు కడియం కావ్యను గెలిపించడంలో కీలకపాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. 

   ఈ కార్యక్రమంలో పాల్గొన్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, డాక్టర్ కడియం కావ్య లు మాట్లాడుతూ ఎన్నో త్యాగాలతో సాధించుకున్న స్వతంత్ర భారతదేశంలో గడిచిన 65 ఏండ్లలో జరగని అక్రమాలు, అనచివేత గత 10 ఏండ్ల బిజెపి పాలనలో జరిగిందని అన్నారు. ప్రజాస్వామ్యానికి ప్రధాన ఆధారం, మూల స్థంబమైన రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తున్న బిజెపి నుండి దేశాన్ని కాపాడడంలో చట్టం, న్యాయం, రాజ్యాంగం గురుంచి తెలిసిన న్యాయవాదులు కీలకపాత్ర వహించాలని, మతతత్వ రాజకీయాల నుండి దేశాన్ని కాపాడి లౌకిక విలవల రాజ్యం కొనసాగాలంటే ఇండియా కూటమిని గెలిపించాలని వారు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి, దళిత బహుజన ప్రజలకు బిజెపి పాలన నుండి పొంచివున్న ప్రమాదాన్ని మేధావులు, విజ్ఞానవంతులు ప్రజలకు వివరించాలని అన్నారు.

   ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ లీగల్ సెల్ అద్యక్షులు పొన్నం అశోక్ గౌడ్, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల కో ఆర్డినేటర్ న్యాయవాది దామోదర్ రెడ్డి, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు జయరాజ్, ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ నాయకురాలు నవికా హర్షే, టిజెఎస్ జిల్లా అద్యక్షులు సీనియర్ న్యాయవాది చిల్ల రాజేంద్రప్రసాద్, వరంగల్, హన్మకొండ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శులు ముదశిర్, లడే రమేష్, లీగల్ సెల్ న్యాయవాదులు తోట రాజ్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి, మహాత్మ, ఐత ప్రసాద్, మహమూద్, నీల శ్రీధర్ రావు, కూనూరు రంజిత్ గౌడ్, డేవిడ్, రమేష్, న్యాయవాదులు జి ఆర్ శ్రీనివాస్, ఇజ్జగరి చంద్రశేఖర్, జంగ స్వప్న, రమాదేవి, శశిరేఖ, మహేందర్, రమేష్, అనిత, రాజబాపు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు