హరిత హోటల్ లో ఈనెల 25 న ప్రజాస్వామ్య పరిరక్షణ సదస్సు

 


ప్రజాస్వామ్య పరిరక్షణ సదస్సును జయప్రదం చేయండి


రాజ్యాంగ పరిరక్షణ జాక్ పిలుపు


భారతదేశంలోని కార్మిక, కర్షక, పేదలు, సామాన్యులు బతికి బాగుపడాలంటే  ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని, సకల జనులకు రక్షణ కవచమైన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని, ప్రజాస్వామ్య పరిరక్షణ - పౌర సమాజ బాధ్యతపై ఈ నెల 25 న హన్మకొండ జిల్లా కేంద్రం హరిత కాకతీయ హోటల్లో జరుగు సదస్సును జయప్రదం చేయాలని రాజ్యాంగ పరిరక్షణ జాక్ కన్వీనర్  డాక్టర్ ఎం. వెంగల్ రెడ్డి అన్నారు. మంగళవారం హన్మకొండ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న మతోన్మాధ, ఫాసిస్టు విదానాలను వ్యతిరేకించి, సెక్యులర్ రాజ్య రక్షణ, ప్రజాస్వామ్య రక్షణ దేశ పౌరులపై ఉందని, దేశంలో జరుగుతున్న విధ్వంసకర అభివృద్ధి గురుంచి, కార్పొరేటీకరణ వల్ల కలిగే నష్టాలు, అశాస్త్రీయ విద్యా విధానం, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయడం తదితర ప్రజా వ్యతిరేక విధానాల వల్ల జరుగు నష్టాన్ని ప్రజలకు వివరించి దుష్ట పాలన కొనసాగిస్తున్న బిజెపినీ ఈ పార్లమెంటు ఎన్నికల్లో నిలువరించాలని ఆయన పిలుపునిచ్చారు. 

   ఐదు ముఖ్యమైన అంశాలపై జరుగు ఈ సదస్సుకు ప్రముఖ మేధావులు, ఉద్యమకారులు హాజరవుతున్నారని ఫాసిస్టు పాలన - దేశంలో రాబోవు పరిణామాలు అనే అంశంపై భారత్ బచావో జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ ఎం.ఎఫ్. గోపినాద్, మత విద్వేషాలు - రాజ్యాంగానికి ముప్పు పై న్యాయవాది పుప్పాల కిరణ్ కుమార్, ఆర్థిక విధానాలు - ఫాసిస్టు ధోరణలు పై ఐఎఫ్ టి యు, జాతీయ నాయకులు పి.ప్రసాద్, ఈ వి ఎం లు, ఎలక్ట్రోల్ బాండ్లు - ఎన్నికలపై ప్రభావం అంశంపై రిటైర్డు లెక్చరర్ సి ఎస్ ఆర్ ప్రసాద్, ప్రజాస్వామ్యం - పౌరుల పాత్రపై రైతు స్వరాజ్య వేదిక నాయకులు కన్నెగంటి రవి లు పాల్గొని ప్రసంగిస్తారని, తెలంగాణ ఉద్యమకారుల వేదిక చైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ, ఖాజీపేట దర్గా పీఠాధిపతి కుశ్రు పాషా లు ప్రత్యేక ఆహ్వానితులకు హారవుతారని ఆయన తెలిపారు.

     ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్ మాట్లాడుతూ దేశంలో మెజార్టీ సమాజమైన బి.సి లకు తీవ్ర అన్యాయం చేస్తున్న బిజెపిని ఈ పార్లమెంటు ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించాలని, హిందువుల పేరున బి.సి ఓట్లను కొల్లగొట్టాలని చూస్తున్న బిజెపి కుట్రలను బి.సి లు గమనించాలని అన్నారు. గత పదేండ్ల బిజెపి పాలనలో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుకు అమ్మడంతో బి.సి రోడ్డున పడ్డారని, కె.జి నుండి పి.జి విద్యతో పాటు ప్రైవేటు యూనివర్సిటీలను ఏర్పాటు చేయడంతో నెలకొల్పి బి.సి లు విద్యను కొనలేక అప్పుల పాలవుతున్నారని, రైతాంగానికి జరుగుతున్న నష్టంలో కూడా బి.సి లే ఎక్కువగా ఉన్నారని, క్రీమిలేయర్ విధానం, రిజర్వేషన్లలో 50 శాతం సీలింగ్, ఇబిసి లకు 10 శాతం రిజర్వేషన్ల వల్ల బి.సి లకు ఎంతో నష్టం జరుగుతుందని అన్నారు. ఎన్నో ఏండ్లుగా కుల జనగణన చేయాలని, చట్టసభల్లో బి.సి వాటా కావాలని పోరాటం చేస్తున్న బిజెపి ఖాతరు చేయడం లేదని విమర్శించారు. కుల జనగణన చేసి సామాజిక న్యాయానికి పెద్ద వేస్తామంటున్న ఇండియా కూటమిని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.

   ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర నాయకురాలు బి.రమాదేవి, న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు నున్న అప్పారావు, లాల్ నీల్ మైత్రి వేదిక నాయకులు డాక్టర్ ఎం. శంకర్ నారాయణ, భారత్ బచావో నాయకులు డాక్టర్ ఎం.డి. రాజ్ మహ్మద్, దొమ్మాట ప్రవీణ్ కుమార్, తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర కన్వీనర్ చింతకింది కుమారస్వామి, పూలే ఆశయ సాధన సమితి నాయకులు డాక్టర్ సంగాని మల్లేశ్వర్, ఒబిసి జాక్ నాయకులు చాపర్తి కుమార్ గాడ్గే, వివిధ సంఘాల నాయకులు సోమయ్య, ఓం బ్రహ్మం, శ్రీమన్నారాయణ చారు, బిరుదురాజు శ్రీధర్ రాజు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు