దేశాన్ని కాపాడాలంటే బీజేపీని ఓడించాలే

 



బిజెపి ని ఓడిచండి దేశాన్ని రక్షించడి 


హన్మకొండలో జరిగిన సదస్సులో ప్రముఖ వక్తల పిలుపు


    అవినీతి రహిత పాలన చేస్తామని, స్వదేశీ ఉత్పత్తులు పెంచి నిరుద్యోగాన్ని నిర్మూలిస్తామని, దేశ ప్రజల మధ్య ఆర్థిక అసమానతలను రూపుమాపుతామనే లాంటి ఎన్నో వాగ్దానాలు చేసి ఆర్థిక ఎజెండాతో  మొదటిసారి అధికారంలోకి వచ్చిన బిజెపి మత విద్వేశాలను రెచ్చగొట్టి హిందూ ఓట్లను కొల్లగొట్టి రెండవసారి అధికారంలోకి వచ్చి ప్రజలను మతం చుట్టూ తిప్పుతూ ఆర్థికేతర అంశాలపై ప్రజల దృష్టిని మళ్లించి, సాంస్కృతిక రంగంలో బలం పెంచుకొని మూడవ సారి అధికారంలోకి రావాలని చేస్తున్న కుటిల రాజకీయాలను ప్రజలు వ్యతిరేకించాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. గురువారం హన్మకొండ జిల్లా కేంద్రం హరిత కాకతీయ హోటల్ లో రాజ్యాంగ పరిరక్షణ జాక్ కన్వీనర్ వెంగల్ రెడ్డి అధ్యక్షతన ప్రజాస్వామ్య పరిరక్షణ - పౌర సమాజ బాధ్యతలు అనే అంశంపై జరిగిన సదస్సులో భారత్ బచావో జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ ఎం.ఎఫ్. గోపినాథ్, ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ, న్యాయవాది కిరణ్ కుమార్, ఐ ఎఫ్ టి యు జాతీయ నాయకులు పి ప్రసాద్, సామాజిక విశ్లేషకులు సి ఎస్ ఆర్ ప్రసాద్, రైతు స్వరాజ్య వేదిక నాయకులు కన్నెగంటి రవి లు సదస్సులో పాల్గొని మాట్లాడారు.



    ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి గద్దెనెక్కిన బిజెపి నోట్ల రద్దు, ప్రైవేటీకరణతో ఉన్న ఉద్యోగాల్లో 12 కోట్ల ఉద్యోగాలను పోగొట్టారని, గత పదేండ్ల బిజెపి పాలన వల్ల ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆర్థిక అసమానతలు పెరిగిపోయాయని అన్నారు. ఆధిపత్య కులాల సంపదకు మతాన్ని జోడించి  ప్రజలను అన్ని విధాలుగా అణచివేస్తూ పాలన కొనసాగిస్తున్న బిజెపి ఫాసిజాన్ని అర్థం చేసుకొని వ్యతిరేకించాలని అన్నారు. బహుళజాతి సంస్కృతి, భాషలు కలిగిన భారతదేశంలో ఒకే దేశం, ఒకే సంస్కృతి అని మాట్లాడుతున్న దుర్మార్గ బిజెపి మాటలను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని అన్నారు. ఎన్నో త్యాగాలతో సాధించుకున్న స్వాతంత్ర భారతంలో సమసమాజం స్థాపన కోసం వ్రాసుకున్న రాజ్యాంగాన్ని నిర్మూలించాలని చూసే బిజెపిని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని, ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న ప్రజలకు ఊపిరాడని పాలన నుండి ఒక వెసులుబాటు, కొంత ఉపశమనం కోసం ఇండియా కూటమిని గెలిపించాలని పిలుపునిచ్చారు. దేశంలో మెజార్టీ ప్రజలైన బి.సి ల జీవితాలను బాగుచేసే ప్రణాళికలు ఏమి రచించకుండా, వారికి సకల సామాజిక రంగాల్లో జనాభా దామాషా ప్రకారం వాటా ఇవ్వకుండా, చట్టసభల్లో వాటా ఇవ్వకుండా హిందూ మతం, రాముడి చుట్టూ తిప్పుతూ మోసం చేస్తున్న బిజెపిని ఓడించి ఇండియా కూటమిని గెలిపించాలని అన్నారు. ప్రజాస్వామ్య పాలన కోరుకునే వారు, ప్రగతిశీల వాదులు శత్రువు ఎవరో మితృవు ఎవరో తెలుసుకొని మిత్రులను కలుపుకొని ఐక్య సంఘటనగా ఏర్పడి శత్రువుపై పోరాటం చేయాలని అన్నారు. కాంగ్రెస్ ను ఓడిస్తే బిజెపి వచ్చిందని మళ్ళీ బిజెపిని ఓడిస్తే ఇండియా కూటమి అధికారంలోకి రావడంతోనే ప్రగతిశీల, ప్రజాస్వామిక వాదులు పని ఆగిపోదని అన్నారు. ప్రజల మనసుల్లో చొప్పించబడిన చెడును తొలగించి, సమసమాజ స్థాపన, శాస్త్రీయ సమాజ స్థాపన కోసం, సామాజికన్యాయం  కోసం కృషి చేయాల్సిన అవసరముందని అన్నారు. 


ఈ కార్యక్రమంలో ఖాజీపేట దర్గా పీఠాధిపతి కుష్రు పాషా, వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి న్యాయవాది ముదుసర్, ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్, లాల్ నీల్ మైత్రి వేదిక రాష్ట్ర నాయకులు డాక్టర్ మార్క శంకర్ నారాయణ, తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర నాయకులు బి. రమాదేవి, న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు నున్న అప్పారావు, భారత్ బచావో నాయకులు జైసింగ్ రాథోడ్, ఎం.డి రాజ్ మహ్మద్, సోమయ్య, ఓం బ్రహ్మం, శ్రీమన్నారాయణ, డిటిఎఫ్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, గంగాధర్, దొమ్మాటి ప్రవీణ్, విముక్త చిరుతల కక్షీ పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ అద్యక్షులు మచ్చ దేవందర్, ట్రైబల్ డెమోక్రాటిక్ ఫ్రంట్ ఉదయ్ సింగ్, మానవ హక్కుల వేదిక నాయకులు రాజు, వివిధ సంఘాల నాయకులు సంగాని మల్లేశ్వర్, కొమ్ము సురేందర్, సందీప్, చాపర్తి కుమార్ గౌడ్గే, తిరుపతి, రమేష్, భారతక్క, ఉమ, జె. కళ, జ్యోతి, గుణిగంటి రమేష్, అర్జున్, నలిగింటి చంద్రమౌళి, మన్నె బాబురావు, బోడ డిన్న, బాసిత్, మాస్ సావిత్రి, ఇతం నగేష్, చెరుపెల్లి దినేష్, పాల రవి, జాబాలి, పాణి , రమేష్, జయంత్, ఈశ్వర్ సింగ్, చెన్న నీలిమ, తాటికొండ సద్గుణ, బిరుదురాజు శ్రీధర్ రాజు, జగన్ రెడ్డి, దూడల సాంబన్న, తెలంగాణ కొమరయ్య, న్యాయవాదులు మార్క రామస్వామి, ఎగ్గడి సుందర్ రామ్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు