ఈ ఫోను..కుమ్మేసింది పోనుపోను

 


ఈ ఫోను..

కుమ్మేసింది పోనుపోను

       టెలిఫోన్ డే 


సురేష్ కుమార్ 

          9948546286


_______________________


_గుడుగుడుమంటూ_ 

_గోలెడతాడు.._

_హల్లో ఆంటూ_ _మొదలెడతాడు.._

_ఎక్కడ ఉన్నా ఎవ్వరినైనా_

_పలకరించి కలుపుతాడు..!_


_బూచాడమ్మా బూచాడు_

_బుల్లిపెట్టెలో ఉన్నాడు.._

*టెలిఫోన్ డే..*

దునియాలో హల్లో మీద బతికే జీవులందరికీ

పండగరోజే మరి..!


ఫోను అలా పోనుపోను

తీగల మీద నడిచి

లోకల్..ట్రంకాల్..

లైటినింగ్ కాల్..

ఎస్టీడీ..ఐఎస్డి..

ఇలా దేశాలు..

దశలు దాటి

బెల్ బిడ్డ 

ఇప్పుడయింది మొబైల్..

ఇంటిలోని దేవత..

జేబులోని భద్రత..,!


ఇప్పుడు ఫోను 

నీ జీవితాన కీలకం..

అదే లేకపోతే మారిపోవు

నీ వాలకం..

రోజులో సగం అదే  నేస్తం..

కొందరికైతే సమస్తం..

అందుకనే అప్పు..తప్పు..

వాట్సప్పు..

కొనుగోళ్లు..అమ్మకాలు..

అమ్మకాలు..

నాటకాలు..సినిమాలు..

నియమాలు..నీ మాయలు!


అంతెందుకు..

నువ్వే ఫోను..

ఫోనే నువ్వు..

అదుంటేనే నవ్వు..లవ్వు..

మొగుడైనా..పెళ్ళమైనా

అడ్జస్టవ్వు..!


☎️📞☎️📞☎️📞☎️

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు