నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్ మహమ్మద్ అజీమ్


 నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్ మహమ్మద్ అజీమ్ 


 శ్రావణి అనే మహిళ హనుమకొండ చౌరస్తా నుండి  షాపింగ్ కొరకు వరంగల్ కి వెళ్లేందుకు అజీమ్ ఆటో ఎక్కి వరంగల్ చౌరస్తాలో దిగి హడావుడిలో  తన బ్యాగు ఆటోలో మర్చిపోయింది.

 వెంటనే పోలీస్ స్టేషన్ కి మహిళా వెళ్లి ఆ బ్యాగ్ లో నాలుగు తులాల బంగారం నక్లెస్ మరియు 40 వేల రూపాయల నగదు ఉందని ఏడుస్తుండగా అంతలోనే  ఆటో డ్రైవర్ అజీమ్ ఆ బ్యాగ్ తో స్టేషన్ కి వచ్చి బ్యాగుతో పాటు నక్లెస్ మరియు నగదు ను అప్పగించడం జరిగింది. 

 తన గొప్ప మనస్సుని మరియు నిజాయితీని చాటుకున్న ఆటో డ్రైవర్ అజీమ్ ని సీఐ ఇంతే జార్గంజ్ మచ్చ శివకుమార్ మరియు సిబ్బంది అభినందించారు.

 శ్రావణి తన కృతజ్ఞతలు అజీమ్ కి తెలియజేసి వెయ్యి రూపాయలు ఆటో డ్రైవర్ కి కానుకగాఇచ్చారు.

 సిఐ గారు మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు అందరూ అజీమ్ లాగే నిజాయితీగా ఎవరైనా ప్రయాణికులు తమ వస్తువులు ఆటోల మర్చిపోతే తిరిగి పోలీస్ స్టేషన్లో అప్పజెప్పాలని సూచించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు