నగరంలో ట్రాఫిక్ మళ్లింపు

 

Your Attention Please 


నయీమ్ నగర్ పెద్ద మోరీ కూల్చుతున్న కారణంగా  ట్రాఫిక్ మళ్ళింపు

 హన్మకొండ, నయీంనగర్ పెద్ద మోరీని కూలుస్తున్న కారణంగా మార్చ్ 05-04-2024 నుండి మూడునెలాలాపాటు ట్రాఫిక్  మల్లించ నున్నట్లు పోలీస్ కమీషనర్ తెలిపారు. పాత బ్రిడ్జి కులగొట్టి దాని స్థానంలో  రూ.8.5 కోట్లతో కొత్త బ్రిడ్జి నిర్మాణం చేయనున్నారు. ఇందులో భాగంగానే మూడు నెలలపాటు నయీం నగర్ రోడ్డు పై రాకపోకలు బంద్ కానున్నాయి. రోడ్డు ప్రయాణికులకు మరియు వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది కలుగ కుండా తేదీ 05-04-2024 నుండి (03) నెలల పాటు రాకపోకలు బంద్ కానున్న నేపద్యంలో ఈ క్రింద తెలుపబడిన విదంగా ట్రాఫిక్ డైవర్షన్ ఉంటుందని కమీషనర్ తెలిపారు.


*1. కరీంనగర్ నుండి ఖమ్మం, నర్సంపేట, వరంగల్ వైపుకు వెళ్లవలసిన భారీ వాహనాలు కేయుసి జంక్షన్ నుండి పెగడపల్లిడబ్బాల, పెద్దమ్మ గడ్డ, ఆటోనగర్, మీదుగా వెళ్ళవలెను.*


*2. కరీంనగర్ నుండి వచ్చేటువంటి RTC బస్సులు కేయుసి జంక్షన్ నుండి పెగడపల్లిడబ్బాల, పెద్దమ్మ గడ్డ, ములుగు రోడ్డు జంక్షన్, అమృత జంక్షన్, హన్మకొండ చౌరస్తా మీదుగా బస్సాండ్ చేరుకోవలెను.*


*3. ఖమ్మం నుండి కరీంనగర్ వైపు వెళ్లవలసిన భారీ వాహనాలు ఉరుసుగుట్ట, కడిపికొండ, మడికొండ, ORR మీదిగా వెళ్ళవలెను.*


*4. వరంగల్, నర్సంపేట, వైపు నుండి కరీంనగర్ వైపుకు వెళ్లవలసిన భారీ వాహనాలు MGM ములుగు రోడ్డు జంక్షన్,పెద్దమ్మ గడ్డ, పెగడపల్లిడబ్బాల, కేయుసి జంక్షన్ మీదుగా వెళ్ళవలెను.*


*5. హన్మకొండ నుండి కరీంనగర్ వైపు వెళ్ళు RTC బస్సులు హన్మకొండ చౌరస్తా, అమృత జంక్షన్, ములుగు రోడ్డు జంక్షన్, పెద్దమ్మ గడ్డ, పెగడపల్లిడబ్బాల, కేయుసి జంక్షన్ మీదిగా వెళ్ళవలెను.*


 ప్రయానీకులు  ప్రజల సేవార్ధమై తీసుకున్న ఈ నిర్ణయాన్ని అర్ధం చేసుకుని ట్రాఫిక్సూ  పోలీస్చ సూచనలు పాటించి   ప్రత్యామ్నాయ మార్గాలలో ప్రాయానించి పోలీసులకు సహకరించ గలరని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా నగర ప్రజలకు విజ్ఞప్తి చేసారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు