సైబర్ క్రైమ్స్ పోలీస్ స్టేషన్ ప్రారంభించిన సిపి

 


సైబర్ క్రైమ్స్ పోలీస్ స్టేషన్ ప్రారంభించిన సిపి


వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన సైబర్‌ క్రైం పోలీస్‌ స్టేషన్‌ ను వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా మంగళవారం ప్రారంభించారు.


 రోజు రోజుకి పెరిగి పోతున్న సైబర్‌ నేరాలను నియంత్రించేందుకుగాను రాష్ట్ర పోలీస్‌ శాఖ తీసుకుంటున్న చర్యల్లో భాగంగా  రాష్ట్రంలో  తెలంగాణ స్టేట్‌ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధ్వర్యంలో రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆరు సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగానే వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన సైబర్‌ కైమ్‌ పోలీస్‌ స్టేషన్‌ను ఎర్పాటు చేయడం జరిగింది. ఈ నూతన పోలీస్‌ స్టేషన్‌ ప్రారంభోత్సవానికి  వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ముఖ్య అతిధిగా హజరయి ముందుగా  సైబర్‌ పోలీస్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌ అవరణలో పండ్ల మొక్కను నాటారు. అనంతరం పోలీస్‌ కమిషనర్‌ పోలీస్‌ అధికారులతో కల్సి  సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌ ప్రారంభించి సైబర్‌ క్రైమ్స్‌ పోలీస్‌ స్టేషన్‌ అధికారులు, సిబ్బందికి పోలీస్‌ కమిషనర్‌ అభినందనలు తెలియజేసారు. ఈ సందర్బంగా పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ సైబర్‌ నేరాలపై ప్రజల్లో అవగాహన తప్పనిసరిగా వుండాలని, సైబర్‌ నేరగాళ్ళ ఉచ్చులో పడవద్దని, అప్రమత్తంగా ఉండాలని, గుర్తు తెలియని వ్యక్తులతో తమ వ్యక్తిగత సమాచారాన్ని పంచుకొవడం, అలాగే మీ సెల్‌ఫోన్లకు వచ్చే  లింక్‌లను క్లిక్‌ చేయడం లాంటివి చేయవద్దని. ఇకపై వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో సైబర్‌ నేరానికి సంబంధించి సైబర్‌ నేరగాళ్ళ చేతిలో ఏవరు మోసపోయిన వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ నూతనంగా ఏర్పాటు చేసిన సైబర్‌ క్రైమ్స్‌ పోలీస్‌ స్టేషన్‌లోను ఫిర్యాదు చేయవచ్చని. ముఖ్యంగా సైబర్‌ బాధితులు సైబర్‌ మోసానికి గురైన వెంటనే  1930 టోల్‌ ఫ్రీ నంబర్‌ కు ఫోన్‌ చేసి సమాచారం అందించాలని. నూతనం ఏర్పాటు చేసిన ఈ పోలీస్‌ స్టేషన్‌ నందు ఒక ఏసిపితో పాటు ఒక ఇన్స్‌స్పెక్టర్‌, ఇద్దరు చోప్పున ఎస్‌.ఐలు, హెడ్‌ కానిస్టేబుళ్ళు, ఎనిమిది మంది కానిస్టేబుళ్ళు సైబర్‌ నియంత్రణతో పాటు,దర్యాప్తు విధులు నిర్వహిస్తారని పోలీస్‌ కమిషనర్‌ తెలియజేసారు. అనంతరం పోలీస్‌ స్టేషన్లలో సైబర్‌ వారియర్స్‌గా విధులు నిర్వహిస్తున్న పోలీస్‌ సిబ్బందికి పోలీస్‌ కమిషనర్‌ చేతుల మీదుగా సెల్‌ఫోన్‌తో పాటు సిమ్‌ కార్డులను అందజేసారు.

ఈ కార్యక్రమములో డిసిపిలు రవీందర్‌, అబ్దుల్‌బారీ, ట్రైనీ ఐపిఎస్‌ అధికారులు, అంకిత్‌, శుభంనాగ్‌, అదనపు డిసిపిలు రవి, సంజీవ్‌, సురేష్‌కుమార్‌, సైబర్‌ క్రైమ్స్‌ పోలీస్‌ స్టేషన్‌ ఏసిపి విజయ్‌కుమార్‌, ఇన్స్‌స్పెక్టర్‌ రవికుమార్‌తో పాటు ఇతర విభాగాలకు చెందిన ఎసిపిలు, ఇన్స్‌స్పెక్టర్లు, ఆర్‌.ఐలు, సైబర్‌ క్రైమ్స్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌.ఐలు, సిబ్బంది పాల్గోన్నారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు