లండన్ లో ఇఫ్తార్ విందు


 రంజాన్ ఉపవాస దీక్షలో భాగంగా మస్లీం సోదరులకు మత సామరస్యాన్ని చాటుతూ వరంగల్ ఎన్ఆర్ఐ ఫోరం లండన్ యుకె అధ్యక్షులు శ్రీధర్ నీల ఇప్టార్ విందు ఇచ్చారు. లండన్ లో  జరిగిన ఇఫ్తార్ విందుకు  ముస్లీం,హిందూ సోదరులు తమ కుటుంబ సబ్యులతో కల్సి హాజరయ్యారు. శ్రీధర్ నీల ఇఫ్తార్ విందు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా శ్రీధర్ నీల మాట్లాడుతూ లండన్ లో హిందు పండగలతో పాటు ఇతర మతాల పండగలు ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. మత సామరస్యాన్ని చాటి చెప్పేందుకే ఇఫ్తార్ విందు ఇచ్చామని ఇందుకు సహకరించిన ముస్లీం సోదరులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు