శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండి..!


 శ్రీ సీతారాముల కళ్యాణము

చూతము రారండి..!


వెడలెను కోదండపాణి 

అడవుల బడి మునివెంబడి.. 

తాటకి వధకో..

అహల్య శాపవిముక్తికో..!


ఇంకా నిద్రే తెమలని బుడతడు..

కౌసల్యా సుప్రజా రామా..

పూర్వా సంధ్యా ప్రవర్తతే..

ఉత్తిష్ఠ నరశార్దూల

కర్తవ్యం దైవమాహ్నికం..

కొలిచే ముని ఇలా పిలిస్తే

వెంట నడిచి వెళ్ళడా

బుల్లి రామయ్య..!


నీ చరణమ్ములు సోకిన

కటిక రాయే నెలతాయెనట..

రాయిని ఆడది చేసిన

రాముని ఎంతని కీర్తింతు..

ఏమని స్తుతింతు..!?


అక్కడితో ఆగాడా..

అదే కౌశికుని వెంట

జనకుని యాగము చూచు నెపమ్మున చనియెను

మిధిలకు దాశరథి..


తన కోసమే పుట్టిన వైదేహి..

పిలుస్తోంది 

పాహిపాహియని..

హరుని విల్లు రఘునాధుడు

చేగొని ఎక్కిట ఫెళఫెళ

విరిగినదీ..

కళకళలాడే సీతారాముల

కన్నులు కరములు కలిసినవీ..


జానకి దోసిట కెంపుల ప్రోవై..

రాముని దోసిట నీలపు రాశై..

ఆణిముత్యములు తలంబ్రాలుగా..

ఇరువుల మెరిసిన

సీతారాముల కళ్యాణము

చూతము రారండి..


అంత కమనీయమై..

రమణీయమై..

నాడు మిధిలలో జరిగిన పెళ్లి

ఇప్పుడు కలియుగంలో

వీధి వీధినా జరిగే 

అపురూప ఘట్టం..

రాములోరి మనువు..

చూస్తేనే పులకించదా తనువు..

అప్పుడు నువ్వు చూడలేకపోయిన 

అపూర్వ దృశ్యం..

మళ్లీ మళ్లీ కళ్ళెదుట 

జరుగుతున్న

కలియుగ అద్భుతం..!

శ్రీరామనవమి శుభాకాంక్షలతో..


ఎలిశెట్టి సురేష్ కుమార్

      9948546286

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు