తెలంగాణ ఎన్ఆర్ఐలు కెసిఆర్ సర్కార్ కు మద్దతుగా నిలవాలి

 


తెలంగాణా రాష్ట్రం సర్వతోముఖాభివృద్దికి ఎన్ఆర్ఐ కుటుంబాలు సిఎం కెసిఆర్ కు

మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందని 

 జలవనరుల అభివృద్ది మండలి చైర్మన్ వీరమల్ల ప్రకాశ్ రావు అన్నారు.

అమెరికా పర్యటనలో ఉన్న ప్రకాశ్ రావు ఫిలడెల్ఫియా తెలంగాణ అసోసియేషన్ నిర్వహించిన

 మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తోట రాజశేఖర్ రవు, కర్రసుభాష్ రెడ్డి, రవి ప్రకాష్ రెడ్డి మైరెడ్డి, ముజిబుర్రహ్మాన్, పవన్ తిరునహరి తదితరులు మీట్ అండ్ గ్రీట్ ఆర్గనైజ్ చేశారు.



ప్రకాశ రావును ఫిలడెల్ఫియా తెలంగాణ అసోసియోషన్ ఘనంగా సత్కరించింది

ఈసందర్భంగా ప్రకాశ్ రావు మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత ఎన్ఆర్ ఐలు ప్రపంచవ్యాప్తంగా 

ఉద్యమ సమయంలో కనబరిచిన స్పూర్తి చారిత్రకమన్నారు.

తెలంగాణ సంస్కృతి సాంప్రాదాయాలను కాపాడుకుంటూ  

ఎన్ఆర్ ఐలు తమ హక్కుల సాదన కోసం ఉద్యమస్పూర్తితో పోరాడాలన్నారు



తెలంగాణ రాష్ర్టం ఘన నీయమైన అభివృద్దిని సాధించిందని అన్నారు.

నదీ జలాల వినియోగం కోసం  సిఎం కెసిఆర్ ఎంతో ముందు చూపుతో  చేపట్టిన ప్రాజెక్టులతో

తెలంగాణ సస్యశ్యామలంగా మారిందని అన్నారు.

సాగు నీటి ప్రాజెక్టులపై పూర్తి అవగాహన కలిగిన  ప్రకాశ్ రావు ప్రాజెక్టుల గురించి విఫులంగా వివరించారు



కెసిఆర్ రాష్ట్రాన్ని ప్రాధాన్యత క్రమంలో అభివృద్ది చేస్తున్నాడని వివరించారు. మొట్ట మొదటి ప్రాధాన్యత విద్యుత్

 రంగానికి ఇచ్చారని రైతుల శ్రేయస్సుకు అనేక పథకాలు అమలు చేశాడని ప్రకాశ్ తెలిపారు. అదే క్రమంలో విద్య,వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు.

వి ప్రకాశ్ ను సత్కరిస్తున్న ఎన్ఆర్ఐ ప్రవీణ్ కచ్చకాయల 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు