కదన రంగం లోకి కెసిఆర్ - హుస్నాబాద్ నుండి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం


 

ఎన్నికలప్రచారంలో వెనకపడ్డ కాంగ్రేస్, బిజేపి పార్టీలు

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల జరుగుతున్న నేపద్యంలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టగా మిగతా రాజకీయ పార్టీలు ఇంకా ప్రచారం మొదలు పెట్టలేదు. బిజేపి పార్టి ఒకటి రెండు సభలు మాత్రమే నిర్వహించింది. మహబూబ్ నగర్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోది ఒక సభలో పాల్గొనగా నిజామాబాద్ లో హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ రెండు సభలలలో బిజెపి భారీగానే జనసమీకరణ చేసింది. కాంగ్రేస్ పార్టి అయితే ఇంకా ప్రచార సభలకు శ్రీకారం చుట్టనేలేదు. బిఆర్ఎస్ పార్టి అయితే ఎన్నికల కోడ్ కు ముందు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో   అధికారికంగానే నిర్వహించిన వేదికలపై ఎన్నికల ప్రచారాస్త్రాలు సంధించింది.  పార్టి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, మంత్రి హరీశ్ రావు ఇద్దరూ  బిజీ బిజీగా సభల్లో పాల్గొన్నారు.

సిఎం కెసిఆర్ అనారోగ్య కారణాలవల్ల ఎ్ననికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. అయితే అస్వస్థతో ఉన్నా  ప్రగతి భవన్ లో ఆయన ఎ్ననికల మానిఫెస్టో తయారు చేసే పనిలో ఉ్నానరని పార్టి వర్గాలే సమాచారం లీక్ చేసాయి. ప్రతిపక్షాలకు ధీటుగా ఎ్ననికల మానిఫెస్టో ఉండబోతోందంటూ పార్టి వర్గాలు చెబుతున్నాయి. అక్టోబర్ 15 వ తేదీన హుస్నాబా ద్లో జరిగి ఎన్నికల సభతో సిఎం కెసిఆర్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు.

సిఎం గతంలో ఇక్కడి నుండే ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. అందుకే సెంటిమెంట్లనుబాగా నమ్మే సిఎం ఈసారి కూడ ఇక్కడి నుండే ప్రచారం ప్రారంభించనున్నారు.

ఎన్నికల ప్రచారంలో ఇప్పటికే బిఆర్ఎస్ పార్టి సగం రాష్ట్రం చుట్టి వచ్చింది. మరోవిడత ప్రతి నియోజకవర్గం చట్ చేసేందుకు ప్లాన్ సిద్దం చేసింది. 

కాంగ్రేస్, బిజేపి పార్టీలు మాత్రం ఇంకా అభ్యర్థుల ఎంపికలో తలమునకలై ఉన్నాయి.  బిఆర్ఎస్ ను గద్దెదించాలని ఆ రెండు పార్టీలు గట్టి పట్టుదలతో కనబరుస్తున్నా ఓటర్ల నిర్ణయం ఎలా ఉండబోతోందో చూడాలి.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు