లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రేస్ పార్టి 13 ఎంపీ స్థానాల్లో విజయం సాధిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ పార్టీకి చాలా చోట్ల డిపాజిట్లు కూడ దక్కవని అన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ 20 వేల మెజార్టీతో గెలుస్తుందని తెలిపారు.
బీజేపీకి లోక్‌సభ ఎన్నికల్లో దేశం మొత్తం మీద 210 ఎంపీ సీట్లు కూడా దాటవన్నారు.
మంగళవారం మీడియాతో ముఖ్యమంత్రి చిట్ చాట్ చేశారు. జిల్లాల విషయంతో పాటు ఇతర అనేక అంశాలపై ఆయన మాట్లాడారు.
కెసిఆర్ జిల్లాలను ఇష్టాను సారం ఏర్పాటు చేసారని అన్నారు. మండలాలు, రెవెన్యూ డివిజన్లను క్రమబద్ధీకరణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆ తర్వాత జిల్లాల ఏర్పాటు ఉంటుందని స్పష్టం చేశారు. కోటి జనాభా ఉన్న హైదరాబాద్‌కి, ఒక్క నియోజకవర్గం ఉన్న వనపర్తిని ఒక జిల్లాగా ఏర్పాటు చేశారని చెప్పారు. పాలమూరుపై ప్రత్యేక దృష్టి పెట్టామని అన్నారు.
తనలోకమంతా ఇక తెలంగాణే అని ముఖ్యమంత్రి అన్నారు. ఇక నుండి పరిపాలనపై పూర్తి స్తాయి దృష్టి ఉంటుందని చెప్పారు. స్కూళ్లు ఓపెన్ అవుతాయి కాబట్టి వాటిపై దృష్టి పెడుతామని అన్నారు. రుణమాఫీ కోసం ఎఫ్ఆర్బీఎం( FRBM) పరిధిలో లోన్ తీసుకుంటామని చెప్పారు. ఇక రాజకీయం ముగిసిందని.. రాష్ట్రంలో తన దృష్టి పూర్తిగా పరిపాలనపైనే పెడుతానని తెలిపారు. ప్రతిపక్షాలు విమర్శలు ఏం అనుకున్న తాను పట్టించుకొనని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు కూడా పూర్తిగా ఇవ్వలేదని ప్రతిపక్షాలు అన్నాయని.. ఇప్పుడు రైతు బంధు నిధులు వేశాక మా క్రెడిట్ అని చెబుతున్నారని అన్నారు.
రేషన్ షాపుల్లో సన్నబియ్యం ఇతర నిత్యావసరాలు...
ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే యూనివర్సిటీలకు కొత్త వీసీలను నియమిస్తామన్నారు. అసెంబ్లీలో చర్చ చేసి ఏదైనా నిర్ణయం తీసుకుంటామని... లేదంటే అఖిలపక్షం పెడుతామని చెప్పారు. రేషన్ షాపుల్లో నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేసి పంచుతామని స్పష్టం చేశారు. సామాన్యులు కొనుగోలు చేసే 9 వస్తువులు రైతుల నుంచి కొనుగోలు చేసి ఇస్తామన్నారు. రేషన్ షాపుల్లో సన్న బియ్యం ఇస్తామని హామీ ఇచ్చారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ప్రజలకు ఇస్తామని మాటిచ్చారు. స్టేట్‌కు ఏం కావాలో వాటిని అమలు చేసేలా చూస్తామని అన్నారు. రైతులకు ఎలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
ముగిసిని అధ్యాయం యూటి...
హైదరాబాద్ నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తారన్న అంశంపై మాట్లాడుతూ
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box