ఈరోజు ఉదయం హైదరాబాదు నుండి బయలుదేరిన బీసీ కమిషన్ చైర్మన్ జి.నిరంజన్ మరియు సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి రంగు మరియు ప్రత్యేక అధికారి జి. సతీష్ కుమార్ నిజామాబాద్ R&B గెస్ట్ హౌస్ చేరుకొని అక్కడ నిజామాబాద్ అడిషనల్ కలెక్టర్...(రెవెన్యూ), డిస్ట్రిక్ట్ బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్, ఆర్డీవో నిజామాబాద్ మరియు ఇతర జిల్లా అధికారులతో కలిసి రాష్ర్టంలో జరగబోతున్న సమగ్ర కులాల సామాజిక, ఆర్థిక, రాజకీయ సర్వే ఏర్పాట్ల గురించి చర్చించడం జరిగింది. ఈనెల 29 న నిజామాబాద్ లో జరగబోయే బీసీ కమిషన్ బహిరంగ విచారణ ఏర్పాట్ల గురించి సమీక్షించడం జరిగింది. తదనంతరం
అక్కడనుండి 5 గంటలకు బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనానికి బయలుదేరి అమ్మ వారిని దర్శనం చేసుకుని రాష్ట్రంలో చేపట్టబోయే బహిరంగ విచారణ కార్యక్రమాలు మరియు సమగ్ర కులాల ఆర్థిక, సామాజిక, రాజకీయ సర్వే కార్యక్రమం విజయవంతం కావాలని అమ్మవారిని ప్రార్థించడం జరిగింది.
అంతకుముందు ఆలయ అధికారులు బీసీ కమిషన్ చైర్మన్ జి నిరంజన్ సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, బాల లక్ష్మీ రంగు మరియు ప్రత్యేక అధికారి జి సతీష్ కుమార్ గార్లను పూర్ణకుంభం తో స్వాగతం పలికి అమ్మవారి శేష వస్త్రాలను మరియు తీర్థ ప్రసాదాలను అందించడం జరిగింది.
బాసర నుండి బయలుదేరి రాత్రికి ఈ బృందం అదిలాబాద్ కు చేరుకుంటుంది.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box