రేవంత్ రెడ్డికి బీసి సంఘాల సెగ


బిసి నేత కాంగ్రేస్ పార్టి సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్యపై అనుచిత వ్యాఖ్యలుచేసిన తెలంగాణ కాంగ్రేస్  పార్టి చీఫ్ రేవంత్ రెడ్డికి బీసిసంఘాల సెగ మొదలైంది.పొన్నాల లక్ష్మయ్య కు వయస్సు పై బడిందంటూ రేవంత్ రెడ్డి చేసిన వాఖ్యల పట్ల తీవ్ర  అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా వరంగల్ ఉమ్మడి జిల్లా కేంద్రం లోని హన్మకొండ కాళేజి విగ్రహం దగ్గర బిసిసంఘాల నేతలు నిరసన వ్యక్తం చేశారు.

 బిసి నేతలను అవమానిస్తే ఊరు కునేది లేదని హెచ్చరించారు. తక్షణమే రేవంత్ రెడ్డి పొన్నాల లక్ష్మయ్యకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసారు.

బీసీలను అధిపత్య కులాల నేతలు ఇప్పటి వరకు కేవలం ఓట్లుగానే చూస్తున్నారని సీట్ల విషయంలో  మోసం చేస్తున్నారని విమర్శించారు.

బీసిల కుల గణన జరిగితే బీసీల మెజార్టి ఎంతో తేలుతుందని జనాబా ప్రాతిపదికన సీట్లు ఇవ్వాల్సి వస్తుందని భయపడి కులగణనకు అడ్డుపడుతున్నారని విమర్శించారు.

రేవంత్ రెడ్డి అధిపత్య కుల అహంకారంతోనే  పొన్నాల లక్ష్మయ్య పై విమర్శలు చేశారని అన్నారు.

బీసీలకు ప్రాధాన్యత ఇవ్వని పార్టీలను ఎన్నికల్లో ఓడించాలని  బీసి సంఘాల నేతలు పిలుపు నిచ్చారు.

నిరసన కార్యక్రమంలో బూర విద్యాసాగర్ గౌడ్, బొనగాని యాదగిరి గౌడ్, మున్నూరు కాపు సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కటకం పెంటయ్య, పెరుకారి శ్రీధర్,  కోఆర్డినేటర్ కనుకుంట్ల రవికుమార్,కార్పోరేటర్ చెన్నం మధు, మాఢిశెట్టి వరుణ్, అడ్వకేట్ వినోద్  ఇతర కులం సంఘాల నాయకులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు