బిఆర్ఎస్ పార్టీలోకి మాజి పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య


 కాంగ్రేస్ పార్టీ సీనియర్ నేత పిసిసి మాజి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య

బీఆర్ఎస్ పార్టీలో చేరడం ఖరారైంది

బిఆర్ఎస్ పార్టి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ పొన్నాల లక్ష్మయ్యను కల్సి

పార్టీలో చేరాలని ఆహ్వానించారు

పొన్నాల లక్ష్మయ్య, మంత్రి కెటిఆర్ ఇద్దరి మద్య చాలా సేపు చర్చజరిగింది

సిఎం కెసిఆర్ ను పొన్నాల లక్ష్మయ్య కలవనున్నారని కెటిఆర్ తెలిపారు

కేసియార్ సూచన మేరకే తాను పొన్నాల లక్ష్మయ్య ఇంటికి వచ్చానని కేటియార్ తెలిపారు

పార్టీలో చేరేందుకు పొన్నాల లక్ష్మయ్య సుముఖ‌త వ్య‌క్తం చేశారని 

 ఆయ‌న‌కు బీఆర్ఎస్‌లో స‌ముచిత స్థానం క‌ల్పిస్తామ‌ని కెటియార్ అన్నారు

కాంగ్రెస్ పార్టీకి పొన్నాల లక్ష్మయ్య ఎంతో సేవ చేశార‌ని అన్నారు.

సీనియ‌ర్ల‌కు కాంగ్రెస్ పార్టీలో క‌నీస గౌర‌వం కూడ  లేకుండా పోయిందని

రేవంత్ రెడ్డి పొన్నాల లక్ష్మయ్య ను  తూల‌నాడిన విధానం హీన‌సంస్కారానికి నిద‌ర్శ‌న మని అన్నారు.

క‌న‌క‌పు సింహాసనంపై ఓటుకు నోటు దొంగ‌ను కూర్చోబెట్టారు అని కేటీఆర్ తీవ్రంగా విమ‌ర్శించారు.

కాంగ్రేస్ పార్టీలో బిసీ నేతలు సీనియర్లు తీవ్ర అగ్రహంతో ఉన్నారు

టికెట్ల విషయంలో గతంలో ఇచ్చిన హామీలు అమలు చేసే పరిస్తితి లేదని

 బిసీ నేతలు బాహాటంగా విమర్శలు చేస్తున్నారు

ఈ నేపద్యంలోనే జగగామ టికెట్ పొన్నాలకు కాకుండా 

 కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి కేటాయించడంతో  పొన్నాల లక్ష్మయ్య కాంగ్రేస్ పార్టీకి రాజీనామా చేసారు

మరి కొందరు బీసీ నేతలు కాంగ్రేస్ పార్టీని వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి




కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు