వెండితెర తొలి సూపర్ స్టార్

 


వెండితెర తొలి సూపర్ స్టార్

మహానటుడు అశోక్ కుమార్

జయంతి..13.10.1911


బాలీవుడ్ సినిమాని 

285 సినిమాల పర్యంతం శాసించిన నటదిగ్గజం అశోక్ కుమార్..నువ్వు..నేను..ఏమిటి మన తండ్రులు పుట్టకమునుపే ఆయన హీరో.. నాన్నలు కళ్ళు తెరిచి సినిమాలు చూడ్డం మొదలు పెట్టేపాటికి ఆయన సూపర్ స్టార్..ఒకరకంగా చెప్పాలంటే భారతీయ సినిమా తొలి సూపర్ స్టార్ ఆయనే..!


హీరోగా అశోక్ కుమార్ చేయని పార్శ్వం లేదు..

నటుడిగా ఆయన చేరని ఎత్తు లేదు..దేవికా రాణి..మీనాకుమారి..మధుబాల..లీలా చిట్నీస్ వంటి అగ్రశ్రేణి నటీమణులతో జతకట్టి ఎన్నో సినిమాల్లో నటించి సూపర్ హిట్లు అందించారు.


నిజానికి హీరోగా అశోక్ కుమార్ కు అవకాశం రావడమే చిత్రంగా జరిగింది.

ఆయన జీవితం కూడా తొలినాళ్ళలో ఎత్తుపల్లాలను చూసింది.న్యాయవాది అయిన అశోక్ కుమార్ తండ్రి 

పెద్ద కొడుకును కూడా లాయర్ చేద్దామని ఆశపడ్డారు.లా చదవడం ఇష్టం లేని అశోక్ పరీక్ష తప్పి బొంబాయి వెళ్ళిపోయి సోదరి ఇంట్లో కొన్నాళ్ళు ఉన్నారు.ఆ తర్వాత బొంబాయి టాకీస్ స్టూడియోలో లాబొరేటరీ అసిస్టెంట్ గా పనికి కుదిరారు.అక్కడ మంచి జీతమే వచ్చేది.బానే ఉంది వ్యవహారం అనుకుంటే హీరో కావాల్సిన యోగం ఆయన ఇంటి తలుపు దబదబా బాదేసింది.బొంబాయి టాకీస్ వారు తీస్తున్న జీవన్ నయా సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో హీరోగా చేస్తున్న హసన్..హిరోయిన్ దేవికారాణితో కలిసి జంప్ అయిపోయారు..ఆ సినిమా నిర్మాత భార్య అయిన దేవిక తిరిగి వచ్చేసింది..అప్పుడు అదే సినిమాకి లాబ్ అసిస్టెంట్ అశోక్ కుమార్ ను దర్శకుడి అభీష్టానికి వ్యతిరేకంగా నిర్మాత పట్టు బట్టి తీసుకున్నారు.

అంతవరకు కుముదలాల్ గంగూలీగా ఉన్న వ్యక్తి అశోక్ కుమార్ గా అవతరించారు.

వెనక్కి తిరిగి చూడకుండా బాలీవుడ్ ని ఏలేసారు..


ఈ మహానటుడి చొరవ వల్లనే దేవానంద్..ప్రాన్..

రాజ్ కపూర్.. తమ్ముడు

కిశోర్ కుమార్ సినిమా రంగానికి వచ్చారు..ప్రాన్ తో మంచి స్నేహం ఏర్పడిన అశోక్ ఆయనతో ఎన్నో సినిమాల్లో కలిసి పనిచేశారు.

1936 నుంచి సాగిన నటప్రస్థానంలో జీవన్ నయా,అచ్చుత్ కన్యా.. ఇజ్జత్.. ప్రేమ్ కహానీ..

నయాసంసార్.. బేగం...

జీవన్ సాధీ..ఉస్తాద్ వంటి ఎన్నో గొప్ప సినిమాలు ఉన్నాయి..పద్మశ్రీ..పద్మభూషణ్..దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాలు ఆయనను వరించాయి.


హీరోగా తన హవా ముగిసిన తర్వాత కూడా క్యారెక్టర్ యాక్టర్ గా...పరిశ్రమ పెద్దగా తన ఉనికిని ఘనంగా నిలుపుకున్నారు అశోక్ కుమార్.. తమ్ముడు కిశోర్ తన పుట్టిన రోజునే మరణించడంతో 1987 నుంచి 2001 లో తను చివరి శ్వాస విడిచే వరకు పుట్టినరోజు జరుపుకొలేదు

ఆయన..!


*_సురేష్ కుమార్ ఇ_*

    9948546286

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు