రోజాకు మద్దతుగా తారా గళం

 భేషరతుగా క్షమాపనలు చెప్పాలని డిమాండ్


ఎపి మంత్రి యాక్ట్రెస్ టర్న్ పొలిటీషియన్ రోజా కు తారాలోకం మద్దతుగా నిలుస్తోంది

ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజాపై టీడీపీ సీనియర్ నేత, 

మాజీ మంత్రి బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టడమే కాక

తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు

ఖుషుబూ, రాధిక, రమ్యకృష్ణ తదితరులతో పాటు

 తెలుగు సినిమాలో హీరోయిన్ గా నటించి

 ప్రస్తుతం మహారాష్ర్ట లోని అమరావతి లోక్సభ స్థానం నుండి

 పార్లమెంట్ సభ్యురాలిగా కొనసాగుతున్న నవనీత్ కౌర్ రోజాకు మద్దతుగా నిలిచారు

 రోజా గురించి ఇంతలా దిగజారి మాట్లాడడం ఏమిటని ఆమె ప్రశ్నించారు

అలా మాట్లాడిన వారికి భార్య, చెల్లి, కూతురు లేరా అని ఆమె నిలదీశారు 

ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజాపై టీడీపీ సీనియర్ నేత,

 మాజీ మంత్రి బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై

నవనీత్ కౌర్ సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో పోస్ట్ చేసారు

తెలుగు రాష్ట్రాల్లో ఆడవారిని గౌరవిస్తారని చెప్పారు. 

టీడీపీ నేత బండారు సత్యనారాయణ చేసిన కామెంట్స్ మాత్రం

 మహిళల గౌరవాన్ని తగ్గించేట్లు ఉన్నాయని అన్నారు.

 ఇలా రాజకీయాల కోసం సిగ్గు లేకుండా మాట్లాడటం తగదని అగ్రహం వ్యక్తం చేసారు

మహిళలు అందరూ రోజాకు అండగా ఉంటారని తెలిపారు.

రోజా సినీ పరిశ్రమకు కూడా సేవలు అందించారని అన్నారు.

చాలా మంది హీరోలతో కలిసి నటించారని చెప్పారు. 

రోజాను కించపర్చేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని, 

బండారు సత్యనారాయణ తన కామెంట్లను వెనక్కి తీసుకుని,

క్షమాపణలు చెప్పాలని నవనీత్ కౌర్ డిమాండ్ చేసారు.


స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో టిడిపి అగ్ర నేత  చంద్రబాబు నాయుడుపై

కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసిన నేపద్యంలో 

అధికార వైసిపీకి ప్రతిపక్ష టిడీపీకి మద్య ప్రచ్ఛన్న యుద్దం కొనసాగుతోంది

ఇరు పార్టీల మద్య మీడియాలో వార్ఫేర్ నడుస్తోంది

ఇందులో భాగంగానే రోజా టిడీపి వారిపై విరుచుకు పడగా టీడీపి నాయకుడు సత్యనారాయణ 

వ్యక్తి గతంగా తీవ్ర ఆరోపణలతో రోజాపై రెచ్చి పోయారు

సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై రోజా కంటతడి పెట్టుకుంది

అయితే సింపతి కోసమే రోజా మీడియా ఎదుట

ఏడుపు నాటకాలు ఆడుతోందని

టిడీపి శ్రేణులు విమర్శలు చేస్తున్నాయి

ఈ ఎపిసోడ్ లో మొత్తానికి రోజాపట్ల సానుభూతి కలగడంతో 

ఇాలాంటి జుగుస్పాకరమై విధానాలకు

 తెర తీసింది మొదట రోజానేనని తెలుగుదేశం పార్టి నేతలు కవరేజి ఇచ్చుకుంటున్నారు 

రోజా పెద్దనక చిన్ననక ఎవరిపైన పడితే వారిపైన నోరు జారి

 ఎదుటి వారిని రెచ్చగొట్టడం వల్లే 

ఇలాంటివి జరుగుతున్నాయని సమర్దించుకుంటున్నారు


రోజాకు లభిస్తున్న మద్దతు కారణంగా టిడిపి శ్రేనులు కొంత తగ్గి సైలెంట్ అయ్యాయి

రోజాపై చేసిన వ్యాఖ్యలపై సిని నటి ఖుష్బూ మాట్లాడుతు బండారు సత్యనారాయణ మాటలు సిగ్గుచేటన్నారు

 బేషరతుగా క్షమాపనలు చెప్పాలని డిమాండ్ చేశారు

ఓ మహిళా ప్రజా ప్రతినిధి నుద్దేశించి ఇలా మాట్లాడటం క్షమించరాని నేరమని

 ప్రధాన మంత్రి వారిపై చర్య తీసుకోవాలని సిని నటి రమ్యకృష్ణ అన్నారు


సినినటి రాధిక మాట్లాడుతూ రాజకీయాల్లో ఇలాంటి దిగజారుడు సిగ్గుచేటన్నారు

మహిళలను పతిత అంటూ ఆఖరుగా దూషనాస్త్రాలు వదలడం చాలా నీచాతి నీచమైన చర్యఅన్నారు


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు