ఏడు కోట్ల ప్రశ్న ఇది

 1923లో అంబేడ్కర్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌కు ఏ థీసిస్ సమర్పించి డాక్టరేట్ అందుకున్నారు?


1923లో అంబేడ్కర్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌కు ఏ థీసిస్ సమర్పించి డాక్టరేట్ అందుకున్నారు? ఈ ప్రశ్న విలువ అక్షరాల ఏడు కోట్ల రూపాయలు. జవాబు తెలిస్తే ఏడు కోట్లు స్వంతం అయ్యేవి కాని..జవాబు చెప్పాల్సిన  వ్యక్తి  తప్పుకుంది. ఇదంతా బిగ్ బాస్ అమితాబ్ హోస్ట్ చేసిన కౌన్ బనేగా కరోడ్ పతి షోలో జరిగింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ షో ప్రపంచంలో అనేక దేశాల్లో బాగా పాపులర్ అయింది. ప్రతి ప్రసారం  కోట్లాది మంది ఉత్కంఠతో  చూస్తుంటారు.

ఈ సారి కొనసాగుతున్న 13 వ సీజన్ లో హిమానీ బుందేలా అనే చూపు కోల్పోయిన మహిళ పాల్గొంది. కోటి రూపాయల ప్రశ్న వరకు జవాబులు చెప్పి ఆ తర్వాత 7 కోట్ల రూపాయల తదుపరి ప్రశ్నకు జవాబు చెప్పుకండానే మద్యలో నిష్క్రమించింది. ఆమె జవాబు చెప్పిన  కోటి రూపాయల ప్రశ్న  ఏంటంటే రెండో ప్రపంచ యుద్ధంలో ఫ్రాన్స్‌లో బ్రిటన్ గూఢచారిగా పనిచేయడానికి నూర్ ఇనాయత్ ఖాన్ ఉపయోగించిన మారుపేరు ఏది?` అనేది. బిగ్ బి అడిగిన ప్రశ్నకు హిమానీ `జీన్ మేరీ రెనియర్` అనే జవాబు ను ఎంపిక చేసింది. ఇది కరెక్ట్ కావడంతో ఆమె కోటి రూపాయల నగదు గెలుచుకుంది. కోటితో పాటు హ్యుందాయ్ ఆరా కారును కూడా హిమానీకి  దక్కింది. 

 ఇక ఆ తర్వాత ఏడు కోట్ల రూపాయల ప్రశ్న కు జవాబు చెప్పాల్సి ఉండగా మద్యలోనే విరమించుకుంది. తనకు కోటి రూపాయలు ముఖ్యమంటూ తప్పుకుంటానంటు తప్పుుకుంది. ఇంతకి ఆ ఏ డు కోట్ల రూపాయల ప్రశ్న ఏంటంటే `1923లో అంబేడ్కర్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌కు ఏ థీసిస్ సమర్పించి డాక్టరేట్ అందుకున్నారు?` అనేది. దీనికి జవాబు `ది ప్రాబ్లెమ్ ఆఫ్ రూపీ` కాగా ఈ  జవాబు చెబితే హిమానీకి ఏడు కోట్లు దక్కేవి కాని ఆమె ఒక వేళ ఆన్సర్ తప్పు అయితే కోటి రూపాయలు  పోతాయనే భయంతో ఆన్సర్ చేయకుండా తప్పుకుంది.

అయ్యోఈ ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పి  ఉంటే పాపం ఏడు కోట్లు హిమానీ బుందేలాకు లభించి ఉండేవని నెటిజెన్లు, వీక్షకులు భాద పడి పోయారు.

హిమానీ బుందేలా 2011 జరిగిన ఓ ప్రమాదంలో పూర్తిగా కంటి చూపు కోల్పోయింది. జీవితంలో ఎదురైన విశాదాన్ని ఎదుర్కునేందుకు పట్టుదలతో చదువుకుని అంధ విద్యార్థులకు మాధమెటిక్స్ భోదిస్తోంది. 

తాను కోటి రూపాయల ప్రైజ్ మని గెలుచుకోవడం తనకే ఆశ్చర్యంగా ఉందని హిమానీ బుందేలా అన్నారు. తాను ఏడు కోట్ల రూపాయల ప్రశ్నకు జవాబు చెప్పాలనుకోలేదని ఎందుకంటే తనకు ఈ కోటి రూపాయలు ఎంతో ముఖ్యమన్నారు. తన తండ్రికి ఓ బిజినెస్ పెట్టిస్తానని అట్లాగే తన లాగే చూపు లేని విద్యార్థుల కోసం తరగుతులు నుర్వహిస్తానని ఇంకా తన తో బుట్టువుల అవసరాలకు వెచ్చిస్తానని వివరించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు