ఢిల్లీలో టిఆర్ఎస్ పార్టి కార్యాలయానికి శంకుస్థాపన

ఏడాది లోగా పూర్తి చేాయాలన్న కెసిఆర్

 


దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ రాష్ర్ట సమితి పార్టి కార్యాలయ భవణ నిర్మాణానికి గురువారం సిఎం కెసిఆర్ శంకుస్థాపన చేశారు.

కార్యాలయం కోసం ఢిల్లీ వసంత్‌ విహార్‌లో కేంద్రప్రభుత్వం లీజు ప్రాతిపదికన 1,100 చదరపు మీటర్ల స్థలం కేటాయించింది. మద్యాహ్నం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులతో పాటు టీఆర్‌ఎస్‌ ఎంపీలు, ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గంతో పాటు ముఖ్య నేతలు పాల్గొన్నారు.

పార్టి కార్యాలయ భవణం ఏడాది లోగా పూర్తి చేయాలని సంకల్పించారు. దేశ రాజధానిలో పార్టి కార్యాలయం నిర్మిస్తుండటం పట్ల పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఇక జాతీయ రాజకీయల పై కెసిఆర్ దృష్టిసారించనున్నారా? అసలు టిఆర్ఎస్ కు కెసిఆర్ కు అంత సీను ఉందా అనేది కూడ చర్చగా మారింది. కెసిఆర్ గతంలో అనేక స్రాలు జాతీయ రాజకీయాల్లో ఇక చక్రం తిప్పుతా చూడండంటూ ప్రకటనలు చేసినా ఆచరణలోకి అడుగు పడలేదు. జాతీయ రాజకీయాల పట్ల కెసిఆర్ వైఖరి ఏంటో స్పష్టత లేక  ఇప్పటికి గందర గోళంగానే ఉంది.  

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు