కెసిఆర్ ఆయన కుటుంబం పారిపోవడం ఖాయం ఎంపి అరవింద్


 తెలంగాణ సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్ర విమర్శలు చేసారు. కేసీఆర్ కుటుంబం రూ.1.70 లక్షల కోట్ల ఆస్తులు అక్రమంగా సంపాదించిందని ఆరోపించారు. విజయ్ మాల్యా పారిపోయినట్టు 2023లో కేటీఆర్, కవిత, సంతోష్, హరీశ్ రావు విదేశాలకు పారిపోతారని అరవింద్ జోస్యం చెప్పారు. గెలిచే చోటుకు కొడుకుని, గెలవని చోటుకు హరీశ్ రావును పంపి  బకరా చేస్తున్నారని వెల్లడించారు.

హుజురుబాద్ లో శనివారం అరవింద్ మీడియాతో మాట్లాడారు. 

హుజురాబాద్ లో ఓడిపోతామన్న భయం లేకపోతే  ఇంటెలిజెన్స్ పోలీసుల నిఘా ఎందుకు ? అని ప్రశ్నించారు. ఇప్పటికే 200 కోట్లు పెట్టి నాయకులను కొనుగోలు చేసాడన్నారు. ఆయన కొనుగోలు చేసిన వాళ్లలో కాంగ్రెసోళ్లున్నారని  2023 నాటికి రేవంత్ రెడ్డి రెండో కొడుకు అవుతాడన్నారు. రేవంత్ ను కెసిఆర్ దత్తత తీసుకున్నాకే పీసీసీ ప్రెసిడెంట్ అయ్యాడన్నారు. కేసీఆర్ కు ఈటల అంటే భయం కాబట్టే ఇన్ని పథకాలు హుజురాబాద్ కు వస్తున్నాయన్నారు

రోహింగ్యాలకు పాస్ పోర్టు ఇవ్వడమంటే ఉగ్రవాదులకు సాయం చేయడమేనని అరవింద్ విమర్శించారు. ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పెద్ద దొంగ అని, కేంద్రానికి అన్నీ అబద్ధాలు చెబుతున్నారని అరవింద్ విమర్శించారు.  తెలంగాణ క్యాబినెట్ లో ఇంతకు దళితులకు చోటు ఎక్కడ? అని ప్రశ్నించారు.

దళితున్ని సీఎం చేస్తానంటివి.. మాట తప్పితివి. నీ క్యాబినెట్ లో ఉన్నది ఒక్కరే ఎస్సీ, ఒక్కరే ఎస్టీ ఉన్నారు అని అన్నారు. కేంద్రంలో బీసీ ప్రధాని, ఎస్సీ రాష్ట్రపత్రి, మోడీ కేబినెట్ లో 27 మంది బీసీలు, 12 మంది ఎస్సీలు, 8 మంది ఎస్టీలున్నారని తెలిపారు అర్వింద్. కేసీఆర్ కెబినేట్ లో ఉన్న మైనార్టీ మంత్రి.. హిందువులను అణచివేసేందుకే ఉన్నాడన్నారు. కేసీఆర్ మంత్రి వర్గంలో 11 మంది అగ్రవర్ణాల మంత్రులే ఉన్నారని తెలిపారు. ఇదా నీ సామాజిక న్యాయం... ప్రధాని మోడీ పాదాలు కడిగి నీ నెత్తిపై చల్లుకో అని అన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు