జో బైడెన్ వైఫల్యం - అఫ్ఘ‌నిస్థాన్‌ పరిణామాలపై ట్రంప్

 


అఫ్ఘ‌నిస్థాన్‌ తాలిబన్ల వశం అయిన తర్వాత చోటుచేసుకున్న పరిణామాలపై  అమెరికా మాజి అధ్యక్షులు ట్రంప్ నోరు విప్పాడు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.  అమెరికా మిల‌ట‌రీ స్థావ‌రాలను తాలిబన్లు స్వాధీనం చేసుకోవడమే కాక ఆయుధాలను కూడ చేజిక్కించుకున్నారు. ఇదంతా జో బైడెన్ వైఫల్యమేనంటూ ట్రంప్ ఆరోపించాడు.  అమెరికా మిలటరీ స్థావరాలపై బాంబులు వేస్తే  బాగుండేదన్నారు. 

అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందడం వల్లే ఆఫ్ఘనిస్థాన్ మొత్తం తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయిందని విమ‌ర్శించారు. ఆఫ్ఘ‌న్‌లో చిక్కుకున్న అమెరికా పౌరులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు కొన్ని చ‌ర్య‌లు తీసుకుంటే బాగుండేద‌ని అన్నారు. ఆఫ్ఘ‌న్‌లో ముందుగా అమెరికా ద‌ళాల‌ను వెన‌క్కి ర‌ప్పించ‌కుండా మొదట అమెరికా పౌరులను ఆ తర్వాత దళాలను ఆయుధాల‌ను తరలించాల్సింద‌ని అన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు