తెలంగాణ రాష్ట్రంలో తాలిబన్ల మద్దతుదారులు..బిజెపి నేత మురళి ధర్ రావు

 


తెలంగాణ రాష్ట్రంలో తాలిబన్ మద్దతుదారులున్నారని, టీఆర్ఎస్ సర్కార్ వారికి అనుకూలంగా వ్యవహరిస్తోందని తెలంగాణకు చెందిన  బీజేపీ సీనియర్ నేత మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇన్‌ఛార్జి మురళీధర్‌రావు ఆరోపించారు. ఎంఐఎం నాయకులు తాలిబన్లకు మద్దతుగా ప్రసంగాలు చేస్తున్నా టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. తెలంగాణ రాష్ర్ట ఆకాంక్షలు ఒక కుటుంబ పాలన వద్ద తాకట్టులో ఉన్నాయని తెరాస నాయకత్వంలోని ప్రభుత్వం దివాళా తీసిందని అన్నారు. తెలంగాణ ఉద్యమ కారులకు స్వంత రాష్ర్టంలో కూడ లాఠి దెబ్బలు తప్పటం లేదన్నారు. తెలంగాణ లో బిజెపి తప్ప  ఇతర పార్టీల డిఎన్ఏ అంతా ఒక్కటే నని  తెరాసను దించగలిగే సత్తా ఒక్క బిజెపీకి మాత్రమే ఉందన్నారు. 

బండి సంజయ్ చేపట్టబోయే ప్రజా సంగ్రామ యాత్ర ప్రోమో, లోగోలను శుక్రవారం ఆయన హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయలంలో విడుదలచేశారు. దీంతో పాటు ప్రజల అభిప్రాయాలు, రిజిస్ట్రేషన్ కోసం మిస్డ్‌ కాల్ నంబర్ 6359119119, వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. ఈ నంబర్ ఈ నెల 24వ తేదీ నుంచి అందుబాటులో ఉంటుందని మురళీధర్‌రావు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 

తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు తీరని అన్యాయం జరిగిందని ఎస్సీలు, ఎస్టీలు నష్టపోయారని అన్నారు. తెలంగాణకు కేంద్రం ఏడేళ్లలో పెద్ద ఎత్తున సహాయం చేసిందని అయితే 10 వ తేదీ లోపు జీతాలు కూడ ఇవ్వలేని పరిస్థితిలో రాష్ర్ట ప్రబుత్వం ఉందని అన్నారు. తెలంగాణలో మార్పు కోరుతూ బండి సంజయ్ యాత్ర చేపట్టారని వివరించారు. బండి సంజయ్ యాత్రను విజయ వంతం చేయాలని  ఆయన కోరారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు