ఎపిలో మరో రెండు వారాలు రాత్రి పూట కర్ఫ్యూ

 


ఎపిలో కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. దాంతో మరో రెండు వారాల పాటు కర్ఫ్యూ పొడిగించారు. ప్రస్తుతం రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉండగా మరో రెండు వారాల పాటు పొడిగిస్తు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారి చేశారు. కోవిడ్ కర్ఫ్యూ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే విపత్తుల నిర్వహణ చట్టం 2005లోని సెక్షన్లు 51 నుండి 60, ఐపీసీ సెక్షన్ 188, ఇతర నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత 24 గంటల వ్యవధిలో 1000పైనే కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 69,173 నమూనాలను పరీక్షించగా.. 1435 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శుక్రవారం సాయంత్రం వెల్లడించింది. తాజాగా నమోదైన 1435 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,00,038కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి ఆరుగురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 13,702 మృతి చెందారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు