ఆయుర్వేద వైద్యురాలిని మోసం చేసి 41 లక్షలు కాజేసిన నైజీరియన్ అరెస్ట్

 


ఆయుర్వేద వైద్యురాలిన మోసం చేసి 41 లక్షలు కాజేసి నైజీరియన్ ను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు.  హైదరాబాద్ కు చెందిన ఓ ఆయుర్వేద వైద్యురాలి మూలికలకు విదేశాల్లో ఆర్డర్లు ఇప్పించే పేరిట 41 లక్షలు కాజేసాడు.  వైద్యురాలితో ఫేస్ బుక్ లో పరిచయం చేసుకున్న నైజీరియన్  విదేశాలకు ఆయుర్వేద వైద్య మూలుకలు ఎగుమతి చేస్తే కోట్ల రూపాయలు వస్తాయంటు నమ్మించాడు. విదేశాల్లో భారతీయ మూలికలకు మంచి డిమాండ్ ఉందని నమ్మించాడు. అంతే కాకుండా వైద్యురాలు తన అయుర్వేద మందుల ఫార్ములా చెబితే 5 కోట్లు వస్తాయని ఆశచూపాడు. అయితే ముందుగా టాక్సు రూపంలో కొంత నగదు చెల్లించాలంటూ నమ్మించాడు. వైద్యురాలి నుండి ముందుగా 41 లక్షలు కాజేసి ముఖం చాటేయడంతో వైద్యురాలికి ఆనుమానం కలిగి పోలీసులను ఫిర్యాదు చేసింది.  దాంతో పోలీసులు రంగంలోకి దిగి నైజీరియన్ ను అరెస్ట్ చేసారు. ముంబై, చెన్నై కేంద్రంగా చేసుకుని నైజీరియనన్లు మోసాలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. అనేక రకాలుగా భ్రమలు కలిగించి మోసాలు చేస్తున్నారని తెలిపారు. 

సైబర్ క్రైం పోలీసులు నైజీరియన్ల  పట్ల పదే పదే హెచ్చరికలు చేసినా మోసపోయే వ్యక్తులు ఇంకా మోసపోతూనే ఉన్నారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు