హర్యానాలో 100 మంది రైతులపై దేశద్రోహం కేసులు

 


బ్రిటీష్ కాలం నాటి కాలం చెల్లిన దేశ ద్రోహ కేసు అవసరమా అంటూ సుప్రీం కోర్టు  ఓ వైపు కీలక వ్యాఖ్యలు చేసిన రోజే హర్యానా పోలీసులు 100 మంది రైతులపై దేశ ద్రోహ కేసులు నమోదు చేశారు.

కేంద్రం తెచ్చిన మూడు వివాదాస్పద రైతు చట్టాలను రద్దు చేయాలంటూ  పంజాబ్, హర్యానా రైతులు సుదీర్ఘ కాలంకా ఆందోళన కొనసాగిస్తున్నారు.  రైతులు తమ ఆందోళనా కార్యక్రమాలను తీవ్రం చేసే క్రమంలో హర్యానాలో పాలక బీజేపీ- జన నాయక్ జనతా పార్టీ కూటమి నేతలను బహిష్కరిస్తామని, వారి కార్యక్రమాలు అడ్డుకుంటామంటూ హెచ్చరించారు. రైతుల హెచ్చరికలు ఖాతరు చేయకుండా డిప్యూటీ స్పీకర్ రణబీర్ గంగ్వా సిర్సాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు రావడం రైతులను ఆగ్రహానికి గురి చేసింది. తాము హెచ్చరించినా లెక్కచేయక కార్యక్రమాల్లో పాల్గొంటారా అంటూ ఆయన కైరులు అడ్డగించి ధ్వంసం చేసారు. కారు అద్దాలు పగల కొట్టారు.  దాంతో పోలీసులు 100 మంది రైతులపై దేశద్రోహం కేసులు నమోదు చేశారు.

అన్నదాతలపై దేశ ద్రోహం కేసులు నమోదు చేయడం పై విమర్శలు వచ్చాయి.  రైతులపై దేశద్రోహం కేసులు పెట్టడం అన్యాయం, అక్రమమని సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు ఖండించారు. పోలీసుల చర్యను వారు తీవ్రంగా తప్పు పట్టారు. ఈ కేసులను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. అన్నదాతల నిరసనలు పట్టించు కోకుండా  కేంద్రం ప్రభుత్వం రాష్ట్రంలో దాని భాగస్వామ్య పక్షాలు కావాలనే రైతుల సహనాన్ని పరీక్షిస్తున్నాయని రైతు సంఘాలు మండి పడ్డాయి. ఈ కేసులన్ని తప్పుడు కేసులని రైతు సంఘాల నేతలు ఆరోపించారు.

మరోవైపు సుప్రీం కోర్టు తాజాగా గురువారం రోజు దేశద్రోహ చట్టంపై  కీల్క వ్యాఖ్యలు చేసింది. బ్రటీష్ కాలం నాటి ఈ చట్టంపై పునసీమక్ష చేస్తామని పేర్కొంది. ఇది చాలా నిరంకుశమైన చట్టమని 75 ఏళ్ళ దేశ స్వాతంత్య్రం తరువాత కూడా ఇది అవసరమా అనికేంద్ర  ప్రభుత్వాన్ని  ప్రశ్నించింది.  దేశ ద్రోహం కేసుపై అనేక పిటీషన్లు ఉన్నాయని అన్నింటిని కలిపి విచారిస్తామని పేర్కొంది. మాజి సైనికాధి కారి ఒకరు దేశద్రోహం కేసును సవాల్ చేస్తు దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

 దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో ఈ దేశ ద్రోహ కేసులు నమోదు చేసారు. ఈ కేసుల్లో సంవత్సరాల తరబడి విచారణలు ఎదుర్కుంటూ  జైళ్లలో మగ్గి పోతున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు