అందరికి ఉద్యోగాలు రావు హమాలి పని పుష్కలంగా ఉంది..మంత్రి నిరంజన్ రెడ్డి

 


మంత్రులు మతి తప్పుతున్నారు. పైత్యం తలకెక్కి తప్పడు మాటలు మాట్లాడుతున్నారు. వరంగల్ జిల్లాలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు  ఓ మహిళా అధికారిని కించ పరుస్తూ మాట్లాడగా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తాజాగా నిరుద్యోగులను కించపరుస్తూ మాట్లాడాడు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో గురువారం మీడియా సమావేశంలో మాట్లాడిన నిరంజన్ రెడ్డి  తెలంగాణలో పంటలు పుష్కలంగా పండాయని హమాలి పని పుష్కలంగా దొరుకుతోందని అన్నారు.  చదువుకున్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగాలు రావని అన్నారు.  పంటల కొనుగోలు కేంద్రాలవద్ద పుష్కలంగా పనిదొరుకుతోందని అంతకు మించిన ఉపాధి ఏముంటుందని ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ ఓ వైపు రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ చేపట్టాలని ఆదేశాలు జారి చేసిన తరుణంలో మంత్రి నిరంజన్ రెడ్డి నిరుద్యోగులను ఉద్దేశించి ఇలా వ్యాఖ్యలు  చేయడం ఆయన భాద్యతా రాహిత్యానికి నిదర్శనం. రాష్ట్రంలో వివిద ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తి చేయాలని ప్రతి ఏటా జాబ్ కాలెండర్ ఖచ్చితంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారి చేశారు. ప్రభుత్వ రంగంలో ఇప్పటికే 1 లక్షా ముప్పై వేలకు పైగా ఉద్యోగాలిచ్చామని నూతన జోన్ల ఆమోదం జరిగిందని మరో యాభై వేల ఉద్యోగాల భర్తీకి  సన్నాహాలు మొదలయ్యాయని  సిఎం  పేర్కొనగా మంత్రి మాత్రం నిరుద్యోలందరికి ఉద్యోగాలు రావని హమాలి పని మాత్రం పుష్కలంగా ఉందంటూ వ్యాఖ్యానించడం విమర్శలకు దారి తీసింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు