టిఆర్ఎస్ లో చేరిన కౌశిక్ రెడ్డి

 


హుజురాబాద్ నియోజక వర్గానికి చెందిన కాంగ్రేస్ పార్టి మాజి నేత కౌశిక్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీలో చేరారు. సిఎం కెసిఆర్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. హుజురాబాద్ లో గెలుపే లక్ష్యంగా వ్యూహం పన్నిన అధికార టిఆర్ పార్టి ఈటల రాజేందర్ ను ఓడించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా మొదటి నుండి ఈటల రాజేందర్ కు ప్రత్యర్థి అయిన కౌశిక్ రెడ్డి తన వైపు తిప్పుకుంది. అయితే కౌశికి రెడ్డి తొందరపడి కాంగ్రేస్ పార్టీకి చెందిన ఓ కార్యకర్తతో ఫోన్ లో మాట్లాడుతు నోరు జారడంతో కథ అడ్డం తిరిగింది. కౌశిక్ రెడ్డికి కాంగ్రేస్ పార్టి అధ్యక్షులు రేవంత్ రెడ్డి షోకాజ్ నోటీసు జారి చేయగా కౌశిక్ రెడ్డి రాజీనామా చేసారు.

ప్రస్తుతం టిఆర్ఎస్ పార్టీలో చేరిన కౌశిక్ రెడ్డి ఉప ఎన్నికల్లో అభ్యర్థిగా పోటి చేయ నున్నారా లేదా తెలియదు. కౌశిక్ రెడ్డికి టికెట్ గ్యారంటీ లేదు. ఉజ్వల భవిష్యత్తు ఉందని మాత్రం సిఎం కెసిఆర్ హామి ఇచ్చారు. ఇక కౌశిక్ రెడ్డిని ఎవరూ ఆపలేరన్నారు. అంటే కౌశిక్ రెడ్డికి టికెట్ ఇచ్చినా ఇవ్వక పోయినా ఇప్పుడు టిఆర్ఎస్ కుడితిలో మునిగిన ఎలుక అయ్యాడు. ఈటెల పై పోటీని టిఆర్ఎస్ ఆశా మాశీగా తీసుకోవడం లేదు.  ఈటల గెలిస్తే రాష్ట్రంలో రాజకీయాలు శరవేగంగా మారుతాయి. భారతీయ జనతా పార్టి రాష్ట్రంలో బలపడేందుకు ఈటల గెలుపు దోహద పడుతుంది. అందుకే సర్వేలపై సర్వేలు చేస్తు ధీటైన అభ్యర్థి కోసం టిఆర్ ఎస్ అన్వేషణ కొనసాగిస్తోంది. ఓ డజను మంది అభ్యర్థులకు పైగా బయోడేటాలు కెసిఆర్ దగ్గర పరీశీలనలో ఉన్నాయి. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు