అట్టడుగు వర్గాల కోసం పోరాడుతా: ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్

హుజురాబాద్ లో పోటీ చేయను-స్పష్టం చేసిన ప్రవీణ్ కుమార్

 


స్వచ్చంధ పదవీ విరమణ ప్రకటించిన తెలంగాణ గురుకులాల సంస్థ కార్యదర్శి, ఐపీఎస్ ఆఫీసర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్. అట్టడుగు, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పోరాటం చేస్తానని ప్రకటించారు.

ఇదిలా ఉండగా తాను హుజూరాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేస్తానని వస్తున్నవన్నీ ఊహాగానాలేనని కొట్టి పారేశారు.

తాను అక్కడ పోటీ చేయడం లేదన్నారు. అయితే త్వరలో రాష్ట్ర రాజకీయాలలో సరికొత్త విప్లవం రాబోతోందని జోస్యం చెప్పారు.

ఈ 74 ఏళ్ల లో అట్టడుగు వర్గాలకు తీవ్రమైన అన్యాయం జరిగిందన్నారు. వారందరి కోసం తాను పోరాటం చేస్తానని ఆర్సెపీ చెప్పారు.

అక్షరం, ఆర్థికం, ఆరోగ్యం ఎజెండాగా పూలే, అంబేద్కర్, కాన్షీరాం ఆశయాల సాధన కోసం ఉద్యమిస్తానని స్పష్టం చేశారు.

సాంఘిక సంక్షేమ కార్యదర్శిగా ప్రజల్లో ఒక్క శాతం మార్పు తీసుకు వచ్చానని, ఇంకా 99 శాతం ప్రజల్లో మార్పు తీసుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే రోజుల్లో అన్ని వివరాలు ప్రకటిస్తానని పేర్కొన్నారు.

ఇప్పటి దాకా అధికారిగా ఉన్న మీరు ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా పేరొందారని, ఎంతో మందిని చంపిన చరిత్ర మీకుందని, దానిపై మీరు ఏమంటారని అడుగగా సమాధానం దాట వేశారు. కాలమే సమాధానం చెబుతుందన్నారు.

గూడెం బిడ్డలు విదేశాలలో చదివేలా తయారు చేశానని అన్నారు. మిగతా వారిని కూడా అలాగే తయారు చేసేందుకు తాను కృషి చేస్తానని చెప్పారు.

తన పంథా ఏ విధంగా ఉంటుందనే దానిపై త్వరలోనే క్లారిటీ ఇస్తానన్నారు. తాను ఏ పార్టీలో చేరబోనని స్పష్టం చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు