ఈటలతో అయ్యేది లేదు...సచ్చేది లేదు..కెసిఆర్ ఎటకారం మాటలు

 


తనకు నచ్చని వ్యక్తులను తీసిపడేయడంలో కెసిఆర్ కు మించిన వారెవరూ ఉండరు. గడ్డిపోచకన్నా అధ్వాన్నంగా తీసి పడేస్తారు. ఈటల రాజేందర్ ను అట్లాగే తీసి పడేసారు. హుజురుబాద్ మండలం తనుగుల మండల ఎంపిటిసి సభ్యురాలి భర్త కు ఫోన్ చేసి మాట్లాడిన కెసిఆర్ సంభాషణలో ఈటల ప్రస్తావన రాగా ఈటల రాజేందర్ చిన్నోడని అన్నారు. వాడని సంభోదిస్తు  అయ్యేది లేదు.. సచ్చేది లేదు.. అది ఇడిసిపెట్టుండి అఁటూ దళిత భందు పథకం విషయం మాట్లాడారు.   హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా  కెసిఆర్ స్వయంగా పరిస్థితులు చక్కదిద్దే పనిలో పడ్డారు. దళిత భందు పథకం తొలుత  హుజురాబాద్ నుండే అమలు చేసేందుకు నిర్ణయించారు. అందులో భాగంగా ప్రగతి భవన్ లో  ఈ నెల 26 న హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన షెడ్యూల్డు కులాల వారికి అవగాహన సదస్సు నిర్వహించ బోతున్నారు. అందు కోసం ఏర్పాట్లు ఘనంగా చేశారు. ప్రత్యేకంగా ఆర్టీసి బస్సులు ఏర్పాటు చేసారు. హుజురాబాద్ నుండి వెళ్లే వారికి  ప్రగతి భవన్ లోనే భోజనాల ఏర్పాట్లు కూడ చేశారు. 

ఈ సందర్భంగానే సిఎం కెసిఆర్ స్వయంగా తనుగుల మండల ఎంపిటిసి సభ్యురాలు నిరోష భర్త రామస్వామికి స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు.

'దళిత బంధు ప్రపంచంలోనే అతిపెద్ద పథకం. ఇలాంటి పథకం ఎక్కడా లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. హుజూరాబాద్‌లో ప్రతి గ్రామంలో ఈ పథకం గురించి వివరించాలి. దళిత జాతి చాలా గొప్పది. దేశానికి, ప్రపంచానికి గొప్ప సందేశం ఇచ్చే పథకం ఇది. దళిత బంధు విజయం దేశానికి, ప్రపంచానికి ఆదర్శవంతమవుతుంది. ఈ పథకాన్ని బాధ్యతతో విజయవంతం చేయాలి. హుజూరాబాద్‌లో ఈ పథకం విజయంపై ఎస్సీల భవిష్యత్‌ ఆధారపడి ఉంది. ఈ నెల 26న హుజూరాబాద్‌ నియోజకవర్గం పరిధిలోని వారు ప్రగతిభవన్‌కు రావాలి. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు' అని ఫోన్‌లో కేసీఆర్‌ వివరించారు.

దళిత భందు పథకం ఆఘ మేఘాలపై సిఎం ప్రకటించడం వెనక హుజురాబాద్ ఉప ఎన్ని వ్యూహం ఉందనేది అందరికి తెల్సి పోయింది. రాష్ర్ట వ్యాప్తంగా అమలు చేయాల్నిస ఈ పథకం లొలుత హుజురాబాద్ లోనే అమలు చేయపూను కోవడం పక్కా ఓట్ల రాజకీయం తప్ప మరోటి కాదు. 

హుజురాబాద్ లో ఈటెలను ఎదుర్కోవడం టిఆర్ఎస్ కు ఆశ మాషి వ్యవహారం కాదు. ఆ విషయం కెసిఆర్ కు బాగా తెల్సే తానే స్వయంగా రంగంలోకి దిగారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు