విశ్వ నాయ‌కుడిగా మోదీకే దక్కిన గౌరవం

 మోది నెంబర్ వన్


కరోనా కాలంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోది ఇమేజ్ తగ్గిందని రెండో విడత కరోనా కట్టడి విషయంలో ఆయన వైఫల్యాలను ఎత్తి చూపుతూ   అంతర్జాతీయ మీడియా రచ్చ రచ్చ చేసింది. అయితే ఇవేవి ఆయన కు మైనస్ పాయింట్లు కాలేదు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న  దేశాధినేతల్లో కెల్లా మరో మారు అగ్రగామిగా నిలిచారు. గ్లోబల్లీడర్స్ సర్వేలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి విశ్వనాయకుడిగా గౌరవం దక్కింది.  అమెరికాకు చెందిన ఓ స‌ర్వే సంస్థ నిర్వ‌హించిన స‌ర్వేలో అమెరికా, బ్రిట‌న్‌తో పాటు 13 దేశాల నాయ‌కుల‌ను తోసిరాజ‌ని మోదీ అగ్ర‌స్థానంలో నిలిచారు. న‌రేంద్ర మోదీ విశ్వ‌నాయ‌కుడిగా ఎంపిక‌య్యారనే విషయం  అంతర్జాతీయ మీడియా కూడ  ప్రస్తావించింది. జనాధారణలో గతంలో కన్నా 20 శాతం మోదీకి జనాధారణ తగ్గినా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాధినేతలతో పోలిస్తే మోదీకి ఎక్కువ శాతం జనాధారణ కలిగిన నేతగా సర్వేలో ఫలితాలు వచ్చాయి. మోదీకి వ‌చ్చిన జనాదరణ 100 లో 66 శాతంగా ఉన్న‌ది. అయితే, గ‌త ఏడాది ల‌భించిన ప్ర‌జాద‌ర‌ణ ఈసారి 20 శాతం తగ్గింది. గత ఏడాది మోదీకి 75 శాతం జనాధరణ లభించింది. 


అమెరికన్ డేటా ఇంటలిజెన్స్ ఫర్స్ మార్నింగ్ కన్సల్ట్  (American data intelligence firm Morning Consult) అనే సంస్థ ప్రపంచ వ్యాప్తంగా 13 అగ్ర రాజ్యాల నేతలపై సర్వే నిర్వహించి గ్లోబల్ లీడర్ రాంకింగ్ ప్రకటించింది.  ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, ఫ్రాన్స్, జెర్మని, ఇండియా, ఇటలి, జపాన్, మెక్సికో, సౌత్ కొరియా, స్పెయిన్, యు.కె, యు.ఎస్ దేశాధినేతల జనాధరణ పై సర్వే జరిపింది. 

 ఈ సర్వేలో భారతదేశానికి చెందిన 2,126 మందిని చేర్చారు. ఇందులో 28 శాతం మంది మోదీ ప్రజాదరణను అంగీకరించలేదు. సర్వేలో కేవలం 3 దేశాల నాయకుల రేటింగ్ 60 శాతం పైన ఉండ‌టం విశేషం. సర్వేలో మోదీ తర్వాత ఇటాలియన్ ప్రధానమంత్రి మారియో ద్రాగి ఉన్నారు. ఆయ‌న‌ రేటింగ్ 65 శాతం. మెక్సికో అధ్యక్షుడు లోపెజ్ ఒబ్రాడోర్ మూడవ స్థానంలో 63 శాతం రేటింగ్‌తో ఉన్నారు. 

ఈ నెల 7న మోదీ చేసిన ప్ర‌సంగంతో ఆయన రేటింగ్ శాతం పెరగ‌డానికి దోహ‌ద‌ప‌డింద‌ని ప‌లువురు నిపుణులు అభిప్రాయ పడ్డారు. దేశంలోని 18 ఏండ్ల వ‌య‌సు పైబ‌డిన వారందరికీ ఉచితంగా కొవిడ్ వ్యాక్సిన్లు అంద‌జేస్తామ‌ని మోదీ చెప్ప‌డంతో ఆయ‌న‌కు ప్ర‌జ‌ల్లో ఆద‌ర‌ణ  తిరిగి పుంజుకుందని విశ్లేషించారు. 


విశ్వ‌నాయ‌కుల రేటింగ్‌..

నరేంద్ర మోదీ (భార‌త్‌) 66%

మారియో ద్రాగి (ఇటలీ) 65%

లోపెజ్ ఒబ్రాడోర్ (మెక్సికో) 63%

స్కాట్ మోరిసన్ (ఆస్ట్రేలియా) 54%

ఏంజెలా మెర్కెల్ (జర్మనీ) 53%

జో బిడెన్ (యూఎస్) 53%

జస్టిన్ ట్రూడో (కెనడా) 48%

బోరిస్ జాన్సన్ (యూకే) 44%

మూన్ జే-ఇన్ (దక్షిణ కొరియా) 37%

పెడ్రో శాంచెజ్ (స్పెయిన్) 36%

జైర్ బోల్సోనారో (బ్రెజిల్) 35%

ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ (ఫ్రాన్స్) 35%

యోషిహిడే సుగా (జపాన్) 29%

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు