అహంకారానికి గోరికడతారు : ఈటల రాజేందర్ హెచ్చరిక


మాజి మంత్రి ఈటల రాజేందర్  భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత మొదటి సారిగా హుజూరాబాద్ నియోజవర్గానికి వచ్చిన ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. గురువారం ఆయన సతీమని జమున తో సహా నియోజకవర్గానికి వచ్చాడు.  ఆయన వెంట వివేక్ వెంకటస్వామి, ఏనుగు రవీందర్ రెడ్డి ఇతర నాయకులు ఉన్నారు.

 దారి పొడవునా అభిమానులు, బీజేపి కార్యకర్తలు స్వాగతం పలికి బ్రహ్మరథం పట్టారు. హుజూరాబాద్, జమ్మికుంట మండలాల్లో ఈటల రోడ్ షో నిర్వహించగా ఆయన సతీమణి జమున కమలాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి ప్రజల మద్దతు కోరారు. కమలాపూర్‌లోని శనిగరం, గోపాలపూర్‌ ప్రజలు, అనుచరులతో ఈటల రాజేంధర్ సమావేశం అయ్యారు.

జమ్మికుంట మండలం నాగారం ఆంజనేయ స్వామి ఆలయంలో  ఈటల రాజేందర్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, హుజురాబాద్ ఉప ఎన్నికతో ప్రజలు.. టీఆర్ఎస్ అహంకారానికి  గోరీ కడతారని హెచ్చరించారు.. 2023 ఎన్నికలకు.. ఈ ఉప ఎన్నిక రిహార్సల్‌గా ఆయన అభివర్ణించారు. తనకు మద్దతిస్తున్న వారిని ఇంటలిజెన్స్ అధికారులు వేధిస్తున్నారని ఈటల ఆరోపించారు. ప్రజలు ప్రేమకు లొంగుతారని. బెదిరింపులకు లొంగరన్నారు. చిలుక పలుకులు పలుకుతున్న మంత్రులకు ఆత్మ గౌరవం ఉందా అని ప్రశ్నించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఏది చెప్పినా ప్రజలు నమ్మరని ఈటల రాజేందర్ అన్నారు. ప్రగతి భవన్‌లో రాసిస్తే చదివే మంత్రులంటూ వారి కుటుంబాలు ఎంత బాధపడుతున్నారో తెలుసుకోవాలని అన్నారు. 

 ఆత్మ గౌరవం పోరాటానికి హుజురాబాద్ వేదిక కాబోతోందని అన్నారు. నియోజకవర్గంలో  ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తానని అన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు