రెమ్ డెసివర్ ఇంజక్షన్ల బాక్ల్ దందా ముఠా అరెస్టు

 


రెమ్ డెసివర్ ఇంజక్షన్లతో బాక్ల్ మార్కెట్ దందాకు పాల్పడ్డ ముఠాను వరంగల్ పోలీసులు అరెస్టు చేేశారు.

కరోనా వ్యాధిగ్రస్తులకు అత్యవసర సమయాల్లో డాక్టర్లు అందించే రెమ్ డెసివర్ ఇంజక్షన్లను ఎం.ఆర్.పి కన్నా అత్యధిక రేట్లతో అమ్మమి సోమ్ముచేసుకుంటున్న ముగ్గురు సభ్యుల ముఠాను టాస్క్ ఫోర్స్  పోలీసులు  గురువారం అరెస్టు చేసారు. వీరి నుండి 28 రెమ్ డెసివర్ ఇంజక్షన్లు, 20 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు అరెస్టు చేసిన వారిలో బాగాజీ మనోహర్,  ఫార్మసీ అసిస్టెంట్, మండి బజార్, వరంగల్, కొలిపాక కుమారస్వామి, భీమారం, వరంగల్, ఐత అశోక్, ఫార్మసి వర్కర్, కరీమాబాద్ ఉన్నారు.
ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం కరోనా వ్యాధి తీవ్రత అధికంగా వుండటంతో అనేక మంది  ఆసుపత్రుల్లో చేేేేతున్నారు.  ఇదే సమయంలో కరోనా వ్యాధి చికిత్సలో భాగంగా వ్యాధిగ్రస్తులకు అత్యవసర సమయంలో అందించే రెమ్ డెసివర్ ఇంజక్షన్ల వినియోగం అధికకావడంతో పాటు ప్రస్తుతం మార్కెట్ అందుబాటులో లేకపోవడంతో ఇదే అదునుగా భావించి స్థానికంగా వుండే హస్పటల్స్ లోని   మందుల షాపులలో పనిచేస్తూ రెమ్ డెసివర్ ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్ ద్వారా అధిక ధరలకు  అమ్మి సొమ్ము చేసుకోనేందుకు సిద్ధపడ్డారు. ఇందులో భాగంగా నగరంలోని ఓ ప్రవైయిట్ హస్పటల్ లో మందుల దుకాణాన్ని నిర్వహిస్తున్న ఈ ముఠా సభ్యులు హెటీరో ఫార్మ కంపెనీ నుండి రెమ్ డెసివర్ ఇంజక్షన్లను ఒక్కోటి 2,800/-రూపాయల చోప్పున కోనుగోలు చేసి వ్యాధిగ్రస్తులకు 3,490/- అమ్మాల్సి వుంది.
కాని ప్రస్తుతం ఈ రెమ్ డెసివర్ ఇంజక్షన్లు  మార్కెట్లో అందుబాటులో లేకపోవడంతో సంబంధిత హస్పటల్ ఫార్మసీ యాజమాన్యం, సిబ్బంది కరోనా వ్యాధి గ్రస్తులకు 35వేల రూపాయల నుండి 45వేల రూపాయలకు బ్లాక్ మార్కెట్లో అమ్మి సోమ్ము చేసుకోవడం జరుగుతోంది.
ఈ బ్లాక్ దందా సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ మరియు సుబేదారి పోలీసులు సంబంధిత హస్పటల్ మందుల దుకాణంపై దాడులు నిర్వహించి వారి వద్ద నుండి 28 రెమ్ డెసివర్ ఇంజక్షన్లతో పాటు 20వేల నగదుతో పాటు  ముగ్గురు నిందితులను పోలీసులు అరెెెస్టు చేసారు.
ఈ బ్లాక్ ముఠాను అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరిచిన సెంట్రల్ జోన్ డి.సి.పి పుష్పా, హన్మకొండ ఎ.సి.పి జితేందర్ రెడ్డి, టాస్క్ఫో ర్స్ ఎ.సి.పి ప్రతాప్ కుమార్, ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్ జీ, సుబేదారి ఇన్ స్పెక్టర్ రామవేందర్, సుబేదారి సబ్-ఇన్స్ స్పెక్టర్ సాంబమూర్తి,
టాస్క్ ఫోర్స్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ సోమలింగం, కానిస్టేబుల్లు శ్రీకాంత్, శృంస్స్మహేందర్, మహమ్మద్ ఆలీ, శ్రీనివాస్, రాజేష్, సృజన్, మీర్ మహమ్మద్ ఆలీ, శ్రీనివాస్ రాజు, చిరు మరియు విజయ్ లను వరంగల్ పోలీస్ కమిషనర్ అభినందించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు