మహిళలకే దక్కిన పుర పీఠాలు

 


గ్రేటర్ మున్సిపల్ కార్పోరేషన్లు, మున్సిపాల్టీల పదవులు మహిళలకే దక్కాయి. గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్, ఖ‌మ్మం మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌తో పాటు సిద్దిపేట‌, జ‌డ్చ‌ర్ల‌, అచ్చంపేట‌, కొత్తూరు, న‌కిరేక‌ల్ మున్సిపాలిటీల కొత్త పాలకవర్గాల ఎన్నికలు శుక్రవారం జరిగాయి.

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పేరేషన్ మేయర్ గా గుండు సుధారాణి, డిప్యూటి మేయర్ గా  రిజ్వానా ష‌మీమ్ ఎన్నికయ్యారు. వరంగల్ మేయర్ పదవి జనరల్ స్థానానికి చెందడంతో పలువురు నేతలు పదవి కోసం పోటి పడ్డారు. అయితే తుది నిర్ణయాన్ని పార్టి అధిష్టానానికి వదిలి వేయడంతో అధిష్టానం నిర్ణయం మేరకే వీరి ఎంపిక జరిగింది. రెండు పదవులు మహిళలకే కేటాయించడంతో పార్టి నేతలు షాక్ అయ్యారు. వత్తిళ్లు తప్పించుకునేందుకే మహిళలకు పదవులు కేటాయించారనే చర్చ జరుగుతోంది. వరంగల్ ఎమ్మెల్యే నన్నపు నేని నరేందర్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఇద్దరు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సమాచారం. అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేకించక పోయినా లోలోన మాత్రం తీవ్ర అసంతృప్తితో రగిలి పోతున్నారు. మహిళలను ఎంపికి చేయడం ఆదర్శనీయమే అయినా ముందు ముందు పార్టీకి వీరి ద్వారా ఏం ఉపయోగం ఉండదని పార్టి నేతలే బాహాటంగా విమర్శలు చేస్తున్నారు.


ఖమ్మం లో 

 ఖ‌మ్మం మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌ మేయ‌ర్‌గా పునుకొల్లు నీర‌జ‌, డిప్యూటీ మేయ‌ర్‌గా ఫాతిమా జోహ్రో ఎన్నికయ్యారు. సిద్దిపేట మున్సిప‌ల్ చైర్మ‌న్‌గా క‌డ‌వేర్గు మంజుల, వైస్ చైర్మ‌న్‌గా క‌న‌క‌రాజు ఎన్నికయ్యారు. అచ్చంపేట మున్సిపాలిటీ చైర్మ‌న్‌గా ఎడ్ల న‌ర్సింహ గౌడ్‌, వైస్ చైర్మ‌న్‌గా శైల‌జా విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి ఎన్నికయ్యారు.  జ‌డ్చ‌ర్ల మున్సిపాలిటీ చైర్మ‌న్‌గా ల‌క్ష్మీ ర‌వీంద‌ర్, వైస్ చైర్మ‌న్‌గా సారికా రామ్మోహ‌న్ ఎన్నికయ్యారు. కొత్తూరు మున్సిపాలిటీ చైర్మ‌న్‌గా బాతుక లావ‌ణ్య యాద‌వ్‌, వైస్ చైర్మ‌న్‌గా డోలీ ర‌వీంద‌ర్ ఎన్నికయ్యారు.  న‌కిరేక‌ల్ మున్సిపాలిటీ చైర్మ‌న్‌గా రాచ‌కొండ శ్రీనివాస్, వైస్ చైర్మ‌న్‌గా శెట్టి ఉమారాణి ఎన్నికయ్యారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు