టిడిపి అధినేత చంద్రబాబుపై క్రిమినల్ కేసు

 


 ఆంధ్ర ప్రదేశ్ రాష్ర్ట ప్రతిపక్షనేత తెలుగుదేశం పార్టి అధినేత నారా చంద్రబాబు నాయుడుపై కరోనా విషయంలో క్రిమనల్ కేసు నమోదు అయింది. ఏపీలోని కర్నూలులో ఎన్440కే వైరస్ గుర్తించారని టీడీపీ అధినేత చంద్రబాబు మీడియా లో  చెప్పిన మాటలపై న్యాయవాది సుబ్బయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసారు. ఐపీసీ 155, 505(1) (బి) (2) సెక్షన్ల కింద 2005 ప్రకృతి వైపరిత్యాల చట్టంలోని సెక్షన్ 4 కింద  నాన్‌బెయిలబుల్ కేసు నమోదు అయింది.

కర్నూలు జిల్లాలో పుట్టిన ఎన్-440 వేరియంట్ ఆందోళన కలిగిస్తోందని చంద్రబాబు మీడియాలో పలుసార్లు వ్యాఖ్యానించారు. ఇంకా చంద్రబాబు ఏమన్నారంటే 

పీ నుంచి వస్తున్న కొత్త స్ట్రెయిన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ హైకోర్టు కూడా హెచ్చరించిందని అన్నారు. వ్యాక్సినేషన్ విషయంలో జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని చంద్రబాబు విమర్శించారు. ప్రజల ప్రాణాలు కాపాడటంలో జగన్ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని ఆరోపించారు. జూమ్ ద్వారా విలేకరుల సమావేశాన్ని నిర్వహించిన చంద్రబాబు.. ఈ విషయంలో ఆవేదనతోనే మాట్లాడతున్నామని వ్యాఖ్యానించారు. బెడ్లు, వెంటిలేటర్ల కొరత లేదని ఏపీ ప్రభుత్వం చెప్పడాన్ని చంద్రబాబు తప్పుబట్టారు. ఏపీ నుంచి పొరుగు రాష్ట్రాలకు నిషేధాజ్ఞలు అమలవుతున్నాయని చంద్రబాబు అన్నారు.

చంద్రబాబు నాయుడు కావాలనే  తెలుగు రాష్ట్రాలలో  కరోనా విషయంలో ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నారని ప్రజలను తప్పు దోవపట్టిస్తున్నారని  అందుకే భయాందోళనకు గురి అవుతున్నారని న్యాయవాది  తన ఫిర్యాదులో ఆరోపించారు. 

చంద్రబాబు ఏమన్నారంటే 

కరోనా వ్యాప్తిని ఆపడానికి లాక్‌డౌన్‌ ఒకటే పరిష్కారమని చంద్రబాబు ప్రతిపాదించారు. ‘ఎన్‌ 440కె అనే మార్పుచెందిన కరోనా వైరస్‌ ఇప్పుడు మన రాష్ట్రంలో ఉధృతంగా ఉంది. దానివల్లే వ్యాప్తి బాగా అధికంగా ఉందని వైద్య నిపుణులు అంటున్నారు. దాన్ని తొలిసారి కర్నూలులో కనుగొన్నారని చెబుతున్నారు. తెలంగాణ హైకోర్టులో కూడా ఈ వైర్‌సపై చర్చ జరిగింది. ఇప్పుడు అది దేశం మొత్తం వ్యాపిస్తోంది. ఉదయం 6గంటల నుంచే మద్యం షాపులు, బార్లు తెరుస్తున్నారు. అవి అంత అవసరమా? సీఎం బాధ్యత తీసుకోవాలి. తనకు తెలియకపోతే నిపుణులను కూర్చోపెట్టుకొని వారి సలహాలు తీసుకోవాలి. లాక్‌డౌన్‌పై త్వరితంగా నిర్ణయం తీసుకోండి. ఎన్ని వందల కోట్లు అయినా ప్రజలందరికీ వ్యాక్సిన్లు అందడానికి నిధులు సమీకరించుకోండి. మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం ఇవ్వాలి. పేదలకు మందులు ఉచితంగా ఇవ్వాలి. కరోనా కాలంలో ధరలు విపరీతంగా పెరిగిపోకుండా అదుపు చేయాలి. పంటలు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి’ అని ఆయన సూచించారు. 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు