మహారాష్ట్ర లో ఎదురు కాల్పులు..14 మంది నక్సల్స్ మృతి



మహారాష్ట్రలోని గడ్చిరోలీ జిల్లా పైడి అటవీప్రాంతలో శుక్రవారం పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి . ఈ ఎదురుకాల్పుల్లో 14 మంది నక్సల్స్‌ హతమయ్యారు. మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చు. అడవుల్లో కాసన్సూర్‌ దళానికి చెందిన మావోయిస్టులు పొగాకు ఒప్పందం గురించి సమీప గ్రామ ప్రజలతో మీటింగ్‌ ఏర్పాటుచేసినట్టు పోలీసులకు సమాచారం అందగా సీ-60 కమాండో బలగాలు అక్కడ మాటు వేశాయి.
గ్రామ ప్రజలను కలిసేందుకు వచ్చిన నక్సల్స్‌ను కమాండోలు చుట్టుముట్టి కాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటివరకు 14 మంది మావోయిస్టుల మృతదేహాలను గుర్తించారు. ఆపరేషన్‌ విజయవంతమైందని, మరింత ఎక్కువ మంది నక్సల్స్‌ హతమై ఉంటారని గడ్చిరోలీ డీఐజీ సందీప్‌ పాటిల్‌ తెలిపారు. ఘటనాస్థలంలో పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రిని కమాండోలు స్వాధీనం చేసుకున్నారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు