వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిని సందర్శించిన సిఎం కెసిఆర్

కరోనా పేషెంట్లకు  భరోసా కల్పించిన సిఎం కెసిఆర్


ముఖ్యమంత్రి కెసిఆర్ శుక్రవారం వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిని సందర్శించారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్ తో పాటుగా అదికారులు ఉన్నారు. 

ముఖ్యమంత్రి ఆస్పత్రిలోకి కోవిడ్ వార్డులలో పర్యటించి రోగులను పరామర్శించారు. రోగులకు అందుతున్న వైద్యసేవలు, సౌకర్యాలపై ఆరా తీశారు. ఓ వృద్ధుడి వద్దకు వెళ్లి ఆయన ఆరోగ్యపరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. దీంతో ఆ వృద్ధుడు ఆనందంతో ‘జిందాబాద్.. కేసీఆర్ నా రెండో ప్రాణం’ అంటూ నినాదాలు చేశారు.

 హ‌న్మ‌కొండ‌లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో హెలికాప్టర్‌  దిగిన కేసీఆర్‌  అక్కడి నేరుగా  ప్ర‌త్యేక వాహ‌నంలో ఎంజీఎంకు చేరుకున్నారు.  కరోనా వార్డుకు వెళ్లారు సీఎం కేసీఆర్‌. ముఖ్యమంత్రి  పీపీఈ కిట్‌ లేకుండానే కరోనా వార్డుల్లో తిరగడం ప్రోటోకాల్ కు విరుద్దమని విమర్శలు వచ్చాయి.  సికింద్రాబాద్ గాంది ఆసుపత్రిలో కూడ ముఖ్యమంత్రి కరోనా వార్డులు సందర్శించిన సమయంలో పిపిఇ కిట్ ధరించ లేదు. కరోనా భారినపడి చికిత్స పొందుతున్న బాధితులతో మాట్లాడిన కెసిఆర్ భయపడవద్దని తానున్నాన‌ని వారికి భరోసా కల్పించారు. కరోనా భాదితులకు వైద్య సేవలు అందిస్తున్న వైద్యులను అభినందించారు. కరోనా రోగులకు అందుతున్న సేవలు అ డిగి తెల్సుకున్నారు. అనంతంర అధికారులతో ఆసుపత్రి సౌకర్యాల గురించి మాట్టాడారు.  

 ఎంజీఎం ఆస్పత్రి విస్తరణ, నూతన భవన నిర్మాణంపై సీఎం సమీక్ష నిర్వ‌హించారు. ఎంజీఎంకు సమీపంలోని  వ‌రంగ‌ల్ సెంట్ర‌ల్ జైలును ప‌రిశీలించారు.  కాకతీయ మెడికల్‌ కాలేజీని ఆనుకొని ఉన్న జైలును ఆసుపత్రిగా మార్చాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది.  జైలును నగర  శివారుకు తరలించే ఏర్పాట్లు త్వరిత గతిన చేపట్టాలని కెసిఆర్  అధికారులను ఆదేశించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు