ఎంపీ రఘురామరాజు కు శరతులతో కూడిన బెయిల్

 


నర్సాపురం ఎంపీ రఘురామరాజు  విషయంలో ఎపి సర్కార్ కు దిమ్మ దిరిగే  షాక్ తగిలింది. సుప్రీం కోర్టు  నర్సాపురం ఎంపీ రఘురామరాజుకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం .. సుప్రీంలో బెయిల్ పిటిషన్ వేయడం సబబేనని వ్యాఖ్యానించింది. సొంత పూచీకత్తు, ఇద్దరు జామీనుదారులతో, లక్ష రూపాయల షూరిటీ బాండ్లతో బెయిల్ తీసుకోవచ్చని పేర్కొంది. గుంటూరు సీఐడీ కోర్టులో వీటిని దాఖలు చేసి బెయిల్ తీసుకోవాలని సూచించింది.   పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ, ప్రభుత్వం తరఫున దవే వాదనలు వినిపించారు. కస్టడీలోకి తీసుకొని విచారించేటంత తీవ్రమైన ఆరోపణలు కావని, అందువల్ల రఘురామకు కస్టోడియల్‌ విచారణ అవసరం లేదని సుప్రీం పేర్కొంది. అయితే, ఆయన దర్యాప్తుకు సహకరించాలని చెప్పింది. అవసరమైప్పుడు 24 గంటల ముందుగా అధికారులు ఆయనకు నోటీసులు ఇచ్చి విచారించవచ్చని సుప్రీం స్పష్టం చేసింది. 

ఇదిలా ఉంటే ఎంపీ రఘురామరాజు శరీరంపై కొట్టిన దెబ్బలు ఉన్నాయని మిల్ట్రి ఆసుపత్రి వైద్యులు ధృవీకరించడం సంచలనం కలిగించింది. గాయాల విషయంలో గుంటూరు జేజే ఆసుపత్రి ఇచ్చిన రిపోర్టుకు భిన్నంగా మిల్ట్రి ఆసుపత్రి వైద్యులు  ఆయన పాదాలపై కొట్టిన గాలాయతో పాటు చర్మ వ్యాధి మచ్చలు ఉన్నాయని రిపోర్టు ఇచ్చారు.  అయితే ఎంపీ రఘురామరాజు కాలికి ఆయనే స్వయంగా గాయం చేసుకుని ఉండవచ్చని  ప్రతి వాదనలు జరిగాయి. 

 తన తండ్రి అక్రమ అరెస్టు, కస్టడీలో పోలీసులు పెట్టిన హింసపై సీబీఐ లేదా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)తో దర్యాప్తు జరిపించాలని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కుమారుడు భరత్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోర్టు పర్యవేక్షణలో ఈ విచారణ జరిపించాలంటూ గురువారం రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. శుక్రవారం జస్టిస్‌ వినీత్‌ శరణ్‌, జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం దీనిపై విచారణ జరిగింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు