కరోనా భాదితుల కోసం చిరు ఆక్సిజన్ బ్యాంక్సు

 


టాలివుడ్ లో సామాజిక సేవలో ఇతర సినిమా నటుల సంగతి ఎట్లా ఉన్నా మెఘాస్టార్ చిరంజీవి కొంత బెట్టర్. ఇతోదికంగా సేవ చేసే గుణం ఉండడంతో ఆయన 1998 నుండి రాష్ర్టంలో బ్లడ్ బ్యాంకులుఏర్పాటు చేసి సేవలందిస్తున్నారు. కరోనా మహమ్మారి వీరవిహారం చేస్తున్న ప్రస్తుత తరుణంలో చాలా మంది ఆక్సిజన్ లభించక అవస్థలు పడుతున్నారు. ఇలాంటి వారిని అదుకునేమదుకు చిరంజీవి రాష్ర్టంలో ప్రతి జిల్లాలో ఆక్సిజన్ బ్యాంకు ఏర్పాటు చేయాలని సంకల్పించాడు.

ఈ విషయాన్ని వెల్లడిస్తూ చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ట్విటర్ వేదికగా అఫీషియల్ స్టేట్‌మెంట్‌ను విడుదల చేసింది. వచ్చే వారం రోజుల్లో ప్రజలకు ఆక్సిజన్ బ్యాంకులు అందుబాటులోకి వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ ఆక్సిజన్ బ్యాంకులకు సంబంధించిన కార్యకలాపాలు, నిర్వహణను హీరో రామ్ చరణ్ చూసుకోనున్నారు. చిరంజీవి తీసుకున్న ఈ నిర్ణయాన్ని అందరు స్వాగతించి అభినందిస్తున్నారు. 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు