సర్కార్ దవాఖానాలకు వెంటి లేటర్లు సేకరించి సమకూర్చిన బాల వికాస

 


సేవా కార్యక్రమాల్లో ముందుండే బాల వికాస స్వచ్చంద సేవా సంస్థ కరోనా మహమ్మారి విజృంభించిన తరుణంలో తమ వంతుగా సహాయానికి పూనుకుంది. మానవతా ధక్పధంతో కరోనా భాదితులను ఆదుకునేందుకు అవసర పడే మెడికల్ పరికరాలను  సమకూర్చింది.  తెలంగాణ రాష్ట్రంలోని  పలు జిల్లాల లోని  ప్రభుత్వ ఆసుపత్రుల్లో వెంటిలేటర్ల కొరత తీర్చేందుకు సిద్ద పడింది. ఇందులో భాగంగా పలు ఆసుపత్రులకు 120 వెంటలేటర్లు సమకూర్చింది. వీటితో పాటు శ్వాస తీసుకునేందుకు కష్టంగా ఉండే పేషెంట్లకు ఉప యోగపడే బిపాప్స్ ను కూడ సేకరించి డొనేట్ చేసింది. గ్లాండ్ ఫ్లోజన్  ఫౌండేషన్ ఆఫ్ గ్లాండ్ ఫార్మా లిమిటెడ్ కంపెని ద్వారా ఈ వైద్య పరికరాలను సేకరించి ఆసుపత్రులకు డొనేట్ చేసినట్లు బాల వికాస స్వచ్చంద సంస్థ  ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శౌరెడ్డి సింగారెడ్డి తెలిపారు.

పలు ప్రభుత్వ దవాఖానాలకు బాల వికాస ఇటీవల ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను కూడ సమకూర్చింది.

కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు భాదితులకు సహాయంగా నిలిచినందుకు గ్లాండ్ ఫ్లోజన్  ఫౌండేషన్ ఆఫ్ గ్లాండ్ ఫార్మా లిమిటెడ్ మేనేజింగ్ ట్రస్టి రఘురామన్ కు శౌరెడ్డి సింగారెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వెంటిలేటర్లను బిపాప్స్ ను ఆయా జిల్లాల కలెక్టర్ల ద్వారా అసుపత్రులకు అంద చేసినట్లు ఆయన వివరించారు.

 కరోనా భాదితులకు సహాయంగ నిలిచినందుకు బాల వికాస స్వచ్చంద సేవా సంస్థను అట్లాగే గ్లాండ్ ఫ్లోజన్ ఫౌండేషన్ ను జిల్లా కలెక్టర్లు, వైద్యాధి కారులు ప్రశంసించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు