నక్సల్ అంకుల్ ప్లీజ్‌.. మా నాన్నను విడిచిపెట్టండి

 మావోయిస్టుల బంధీలో కమాండర్ రాకేశ్వర్ సింగ్

విడిచి పెట్టాలని కుటుంబ సబ్యుల వేడుకోలు
హక్కుల సంఘాల నేతల మద్యవర్తిత్వం కోసం చత్తీస్ గఢ్ రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు


మావోయిస్టుల చెరలో ఉన్న కోబ్రా బెటాయిలన్ కమాండో రాకేశ్వర్ సింగ్ ను మావోయిస్టులు ప్రాణాలతో విడిచి పెడతారా లేదా అనే విషయంలో ఆయన కుటుంబ సబ్యులు తీవ్ర దుఖ్ఖంలో మునిగి పోయారు.  సుక్మాలో దాడి సంఘటనలో రాకేశ్వర్ సింగ్‌ మిన్హాస్‌ కనిపించకుండా పోయాడు. అయితే అతను తమ ఆధీనంలో ఉన్నాడని మావోయిస్టులు  ప్రకటించారు.  జమ్మూ కశ్మీర్‌కు చెందిన రాకేశ్వర్ సింగ్ 2011లో సీఆర్పీఎఫ్‌లో చేరాడు. 

దాడి సంఘటన గురించి టివి వార్తల్లో చూసిన  రాకేశ్వర్‌సింగ్ కుటుంబ సబ్యులు ఆందోళన చెందారు. అతని ఆచూకి తెలియ లేదన్న వార్తలతో మూడు రోజులుగా తిండి మానివేసి దుఖ్ఖంతో గడుపుతున్నారు. రాకేశ్వర్‌సింగ్ భార్య  మీను మిన్హాస్ జమ్మూ కశ్మీర్‌లోని సీఆర్‌పీఎఫ్ హెడ్ క్వార్టర్స్ ను సంప్రదించి తన భర్త ఆచూకి కోసం విచారించింది. అయితే తమకు ఏ సమాచారం లేదని తెలిస్తే వెంటనే తెలియ చేస్తామని సిఆర్ పిఎఫ్ అధికారులు తెలిపారు.  దాంతో ఏదైనా తన భర్త గురించిన సమాచారం తెలుస్తుందని కంటికి కునుకు లేకుండా తిండి లేకుండా గడుపుతూ ఎదురు చూస్తోంది. తన భర్త దేశం కోసం పని చేస్తున్నాడని అతన్ని క్షేమంగా విడిపించి తీసుకు రావాలని మీను మిన్హాస్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాను వేడుకుంది.  తన భర్త  చివరి సారిగా తమతో శుక్రవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో మాట్లాడారని ఆ తర్వాత డ్యూటీకి వెళ్లాడని పేర్కొంది.

రాకేశ్వర్‌సింగ్‌ మావోయిస్టుల భందీలో ఉన్నట్లు తెలియడంతో  అతన్ని విడిపించేందకు చత్తీస్ గఢ్ ప్రభుత్వం ప్రయత్నాలు చేపట్టింది. హక్కుల సంఘం నేతల మద్యవర్తిత్వం కోసం సంప్రదింపులు కొనసాగిస్తోంది.  

"నక్సల్ అంకుల్ ప్లీజ్‌.. మా నాన్నను విడిచిపెట్టండి" అంటూ రాకేశ్వర్‌సింగ్ ఐదేళ్ళ  కూతురు శ్రాగ్వి మావోయిస్టులను వేడుకుంటున్న దృష్యాలు టీవీలలో చూసిని వారి హృదయాలు బరువెక్కి పోయాయి. ఈ దేశంలో విప్లవోద్యమం నక్సలైట్లకు పోలీసులకు మద్యయుద్దంగా మారి రక్త సిక్త మైపోవడం దురదృష్టకరం. చత్తీస్ గడ్ తో పాటు ఒడిశా, మహారాష్ట్ర దండకారణ్యంలో రెండు వైపులా రక్తపు టేరులు పారుతున్నాయి. 


వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు