ఎవరీ హిద్మా ?

 దండకారణ్య దాడుల్లో సిద్దహస్తుడు
ముపుప్పేట దాడులతో ముప్పు తిప్పలు పెట్టే వ్యూహాలు
హిద్మా  దాడుల్లో  భారీగా భద్రతా దళాల ప్రాణ నష్టం   


హిద్మ...ఇతని పేరు సుక్మాలో భద్రతా దళాలపై మెరుపు దాడి అనంతరం మీడియాలో బాగా వైరల్ అయింది.  చత్తీస్ గడ్ దండకాణ్యంలో కూంబింగ్ నిర్వహిస్తున్న  భద్రతా దళాల పై మెరుపు దాడి చేసిన మావోయిస్టు గెరిల్లా చీఫ్. హిద్మన్న, మాడ్వి హిద్మ, హిద్మడు, సంతోష్ తదితర పేర్లతో పిలుస్తుంటారు. హిద్మా తండ్రి పేరు పొడియం సోమ ఏలియాస్ దుగ్గ వాడే. జాగర్ గుండా పోలీస్ స్టేషన్ పరిదిలోని     పూవర్తి గ్రామం.  మురియా ఆదివాసి తెగకు చెందిన  హిద్మా వయస్సు ప్రస్తుతం 51 సంవత్సరాలు. ఒడిశా, ఆంధ్ర ప్రదేశ్, చత్తీస్ గడ్  దండకారణ్యంలో మావోయిస్టుల  జనత సర్కార్ కు హిద్మా  రక్షణ కవచం. జనతన సర్కార్ పరిదిలో పోలీసులు ఇప్పటి వరకు అడుగు పెట్టలేదు. దండకారణ్యంలో హిద్మాను మట్టు బెట్టేందుకు భద్రతా దళాలు అనేక సార్లు చేసిన యత్నాలు విఫలం అయ్యాయి. దాడికి యత్నించిన  ప్రతి సారి భారి ఎత్తున భద్రతా దళాల ప్రాణనష్టం జరిగింది. ఓ దశాబ్దానికి పైగా భద్రతా దళాలకు మోస్ట్ వాంటెడ్ కావడంతో అతని కోసం తీవ్రంగా గాలింపు జరుగుతోంది. హిద్మా తలపై నాలుగు రాష్ట్రాలలో రివార్డులు ఉన్నాయి.

హిద్మా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా బటాలియన్ వన్ చీఫ్ కమాండర్ గా కీలక భాద్యతలు నిర్వహిస్తున్నాడు. హిద్మా చుట్టూ కనీసం 200 నుండి 250 వరకు మారణాయుధాలు కలిగిన గెరిల్లా యోధుల కాపలా ఉంటుంది. రణ తంత్రంలో అరి తేరిన హిద్మా  పిలిఫ్పైన్స్ లో గెరిల్లా యుద్ద తంత్రంలో ప్రత్యేక శిక్షణ పొందాడు.

కేవలం పదో తరగతి వరకే చదువుకున్న హిద్మా 1990 లో విప్లవోద్యమంలో చేరాడు. ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడతాడు. పలు గోండు భాషలతో పాటు అనేక ప్రాంతీయ భాషలు మాట్లాడ గలడు.

జీరం అటవి ప్రాంతంలో 2013 లో హిద్మా నాయకత్వంలో  కాంగ్రేస్ పార్టి ర్యాలి పై మెరుపు దాడి జరిగింది. ఈ దాడిలో సల్వాజుడం రూపకర్త మహేంద్ర కర్మతో పాటు  32 మంది చనిపోయారు. ఒడిశా, ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్రాల సరిహద్దులను ఆనుకుని ఉన్న  దట్ట మైన దండకారణ్య  ప్రాంతం దక్ణిణ భస్తర్ అంతా జనతన సర్కార్ లో ఉంది. ప్రధానంగా భెజ్జి పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టుల మెరుపు దాడులు అనేకం జరిగాయి. 2017 లో రెండు వేరు వేరుగా భద్రతా దళాలపై జరిగిన మెరుపు దాడుల్లో ఓ సారి 12 మరో సారి 25 మంది సిఆర్ పిఎఫ్ జవాన్లు చనిపోయారు.   2010 లో చత్తీస్ గఢ్ లోని తాడిమెట్లలో 76 మంది సిఆర్ పిఎఫ్ జవాన్లు మావోయిస్టుల మెరుపు దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. అదే సంవత్సరం నారాయణ పూర్ జిల్లా జగ్దా ఘాట్ వద్ద 26 మంది చనిపోయారు. 2020 మార్చిలో 17 మంది చనిపోయారు.

తెర్రం అటవి ప్రాంతంలో భీజాపూర్, సుక్మా సరిహద్దుల్లో ఏప్రిల్ 3 న (2021) జరిగిన దాడి భద్రతా దళాల ఆత్మస్ఱైర్యాన్ని  దెబ్బతీసాయి.ఈ దాడిలో 23 మంది చనిపోగా  భద్రతా దళాలు కమాండర్ ఒకరిని మావోయిస్టులు భందీ చేసారు. ఈ మేరకు మావోయిస్టుల ప్రకటించారు. 

సిఆర్ ప్ఎఫ్ బలగాలతో పాటు మావోయిస్టులను మట్టు బెట్టేందుకు ప్రత్యేకంగా రూపొందించిన కమాండో బెటాలియన్  ఫర్ రిసొల్యూట్ ఆక్షన్ - కోబ్రా  బలగాలు,  స్టేట్ పోలీస్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ డిస్ట్రిక్ట్ రిజర్వు గార్డ్స్ సుమారు 1700 మంది హిద్మా కోసం గాలింపు చేపట్టి మావోయిస్టుల వ్యూహాంలో చిక్కారు. భద్రతా దళాలపై మావోయిస్టులు ముప్పేట దాడి జరిపారు.  ఎత్తులో ఉన్న  గుట్టలపై నుండి కాల్పులు జరిపారు. హిద్మా నాయకత్వంలో  సుమారు 300 మంది నక్సలైట్లు దాడిలో పాల్గొన్నారు.  

దాడి సంఘటనలో ఓ లైట్ మిషన్ గన్ త్ పాటు రెండు ఎస్ ఎల్ ఆర్ లు, ఏడు ఏ.కె 47 ఆయుధాలను మావోయిస్టులు ఎత్తు కెళ్లారు. 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు